Advertisement
సినిమా అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. సినిమా కాస్టింగ్ దగ్గర నుండి కాస్ట్యూమ్స్ వరకూ ప్రతిది పక్కా ఫర్ఫెక్ట్ గా ఉంటుంది..సీన్ సీన్ కి,సాంగ్ లో ఒక పది వరకు కాస్ట్యూమ్స్ మారుస్తూనే ఉంటారు మన నటులు..కానీ సినిమా మొత్తం కేవలం ఒకే ఒక్క డ్రెస్ లో కనపడిన సినిమాలు కూడా ఉన్నాయి..వాటిల్లో కొన్ని..
సోన్ చిరియా..
ఇటీవల మరణించిన సుశాంత్ రౌడీ పాత్ర పోషించిన సినిమా సోన్ చిరియా..ఈ సినిమాలో సుశాంత్ తోపాటు భూమీ ఫడ్నేకర్, మనోజ్ బాజ్ పాయ్ తదితరులు నటించారు..ఈ సినిమాలో ఎంటైర్ కాస్టింగ్ ఒకే కాస్టూమ్ లో కనపడతారు..
Advertisements
అ(AWE)
నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అ సినిమాలో కూడా నటులంతా ఒకే కాస్టూమ్లో ఉంటారు.. ఈ సినిమాలో రెజీనా,కాజల్, అవసరాల శ్రీనివాస్, మురళీశర్మ ఇలా ఎందరో మనకు తెలిసిన నటులు నటించారు.. వీరంతా ఒకే డ్రస్ తో మనకు సినిమా ఆద్యంతం కనపడతారు..
మిస్టర్ ఇండియా-అనీల్ కపూర్
అనిల్ కపూర్,శ్రీదేవి జంటగా 1987లో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమాలో అనిల్ కపూర్ సినిమా మొత్తం ఒకే కాస్టూమ్లో కనపడతారు..ఆఖరికి పాటల్లో కూడా అనిల్ ది అదే డ్రస్ తలపై టోపి, ఒక కోట్, చొక్కా,ప్యాంట్..
Advertisement
ఖైదీ – కార్తీ
ఇటీవల కార్తీ కి సూపర్ డూపర్ హిట్ కట్టపెట్టిన ఖైదీ సినిమాలో కార్తీ పాత్ర కూడా సినిమా మొత్తం ఒకే డ్రెస్ లో కనపడుతుంది.
చమేలీ –కరీనా కపూర్
చమేలీ సినిమాలోకరీనా కపూర్ వేశ్యపాత్రలో నటించి మెప్పించింది..ఈ సినిమా మొత్తం కరీనా ది ఒకే వేషదారణ..
గులాబ్ గ్యాంగ్ – మాధురీ దీక్షిత్
ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాటం చేసిన ఒక గ్యాంగ్ ఆధారంగా తీసిని ఈ చిత్రంలో మాధూరీ దీక్షిత్ గ్యాంగ్ లీడర్ గా నటించింది..ఈ చిత్రంలో ఆ గ్యాంగ్ సభ్యులంతా పింక్ కలర్ చీరల్లో కనిపిస్తారు..సినిమా మొత్తం మాధురితోపాటు తన గ్యాంగ్ సభ్యులు కూడా అవే చీరల్లో కనపడతారు.
మున్నాబాయ్ ఎంబిబిఎస్- అర్శద్ వార్సి
మున్నాబాయ్ ఎంబిబిఎస్ తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ గా వచ్చింది..ఈ సినిమాలో ఎటిఎం పాత్రలో కనపడింది శ్రీకాంత్ అయితే..హిందీలో ఆ పాత్ర పోషించింది అర్శద్ వార్సి.. ఆ సినిమా మొత్తం వారి గెటప్ కేవలం ఒక్కటే డ్రెస్..
NH10- అనుష్కశర్మ
వాస్తవకథ ఆధారంగా తెరకెక్కిన NH10 మూవీలో అనుష్క శర్మ ప్రధాన పాత్ర పోషించింది..ఈ సినిమాలో అనుష్క సింగిల్ కాస్టూమ్ లో కనపడుతుంది.
ఒన్స్ అపాన్ ఏ టైం ముంబయ్ లో అజయ్ దేవగన్, థోడా ప్యార్ థోడా మ్యాజిక్ లో రాణిముఖర్జీ కూడా సింగిల్ క్యాస్టూమ్లోనే కనపడతారు..ఇవి కోన్ని ఉదాహరణలు మాత్రమే మీకు ఏమైనా తెలిసిన చిత్రాలు,నటులు ఉంటే కామెంట్ చేయండి..
Advertisements