Advertisement
ప్రపంచంలో 5 జంతువులు….తమ జీవితకాలం మొత్తం ఒకే ఒక్క జీవిత భాగస్వామిని కలిగి ఉంటాయి. నిజమైన ప్రేమకు నమ్మకానికి చిహ్నాలుగా వీటిని చూపిస్తుంటారు. ఆ జంతువులేంటో ఇప్పుడు చూద్దాం.!
సన్ కాన్యూర్:
సౌత్ అమెరికాలో కనిపించే ఈ పక్షులు… 4-5 నెలల్లోనే తమ పార్టనర్ ను ఫిక్స్ చేసుకుంటాయి. అప్పటి నుండి కలిసి పెరుగుతాయట.! ఒకదానికి ఒకటి తినిపించుకోవడం కూడా చేస్తాయట.! ఇవి జీవిత కాలం తమ పార్టనర్ ను మార్చవట.!
కుచ్చు టోపి కొంగలు:
ఉగాండాలో కనిపించే ఈ కొంగలు కూడా వన్ లైఫ్ -వన్ పార్టనర్ అనే థీమ్ ను ఫాలో అవుతాయట.. ప్రతిరోజూ గూడు నుండి బయటకు వెళ్లేటప్పుడు ..రెండు కలిసి డాన్స్ చేసి ఆహార వేటకు వెళతాయట.!
Advertisements
Advertisement
టిట్టి మంకీస్:
ఈ జంట అన్యోన్యత చాలా ఘాడమైనది. తమ తోకలను జతగా చేసి తమ లవ్ ను ఎక్స్ ప్రెస్ చేస్తుంటాయి. కాసేపు తన పార్టనర్ కనిపించక పోతే ఆగమాగమైపోతాయట ఇవి!
సముద్ర గుర్రాలు:
ఇవి కూడా తన పార్టనర్ చనిపోయే వరకు వేరే వైపు కన్నెత్తి చూడవట.! పిల్లలను కనే బాధ్యత తల్లిదైతే, సాకే బాధ్యత తండ్రి సముద్ర గుర్రం తీసుకుంటుందట!
మరుగుజ్జు జింకలు:
వీటికో ప్రత్యేకత ఉంది. ఆడ జింకల కోసం మగ జింకలు ప్రాణాలకు తెగించి మరీ పోరాటం చేస్తాయట… మగ మరుగుజ్జు జింక ఒక పార్టనర్ కు ఫిక్స్ అయ్యాక… దాన్ని మరో జింక ఫ్లట్ చేయాలని చూస్తే దానితో యుద్దానికి దిగుతుందట!
Advertisements