Advertisement
‘బేబీస్ డే అవుట్’ అనే హాలీవుడ్ మూవీ ఆధారంగా….నాగార్జున తనయుడు అఖిల్ ప్రధాన పాత్రలో శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన సినిమా సిసింద్రీ….ఈ సినిమా సమయంలో అఖిల్ వయస్సు 12 నెలల పిల్లాడు! 1995 సెప్టెంబర్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమాకు టాప్ హీరోలకు వచ్చిన ఓపెనింగ్స్ వచ్చాయి! తల్లిదండ్రులు తమ పిల్లల్ని వెంటబెట్టుకొని మరీ థియేటర్లకు వెళ్లారు. 90’s కిడ్స్ కు అదో మరిచిపోలేని అనుభూతి.
కథ -నటన
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుణ్ని ఎవరో కిడ్నాప్ చేస్తే తల్లి మనసు ఎంత గాయపడుతుందో అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా సిసింద్రీ! ఇందులో అఖిల్ తల్లిదండ్రులుగా శరత్ బాబు, ఆమని నటన ఆకట్టుకుంటుంది. శరత్ కుమార్ తమ్ముడిగా శివాజీ రాజా నెగిటివ్ రోల్‌లో కనిపించి రక్తి కట్టించాడు. అన్నయ్య మీద కోపంతో సిసింద్రీని కిడ్నాప్ చేసేందుకు ప్రణాళిక రచిస్తాడు శివాజీ…. ఇందుకు అక్కన్న, మాదన్న, జక్కన్న పాత్రల్లో నటించిన తనికెళ్ల భరణి, సుధాకర్, గిరిబాబు ల సహాయం తీసుకుంటాడు. అలా అపహరించిన ఆ గ్యాంగ్‌ను సిసింద్రీ తన చిలిపి పనులతో ఆటాడుకుంటాడు. మరోవైపు కొడుకు కనిపించలేదనే బాధతో ఉన్న శరత్, ఆమనిలకు నాగార్జున తోడై, సాహసించి సిసింద్రీని ఆ ముఠా నుంచి రక్షించి తల్లిదండ్రులకు అప్పగిస్తాడు. బ్రహ్మానందం, ఎ.వి.ఎస్ కామెడీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చిన్న పిల్లల కథాంశంతో తెరకెక్కిన చిత్రాల్లో ‘సిసింద్రీ’ ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.
Advertisement
ముఖ్యంగా రాజ్ మ్యూజిక్ , ఎస్ .గోపాల్ రెడ్డి కెమెరాపనితనం, సీతారామశాస్త్రి పాటలు ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గీత రచనలో రాజ్ స్వరపరిచిన ‘చిన్ని తండ్రీ నిను చూడగా’ అనే పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది.
Advertisements
Advertisements
బాక్స్ ఆఫీసు రికార్డ్స్ :
- స్టార్ హీరోస్ రేంజ్ లో కలక్షన్స్ కొల్లగొట్టింది సిసింద్రీ , ఒక పసికందుకు కటౌట్లు కట్టడం అదే తొలిసారి .
- నైజాంలో మొదటివారం 31 లక్షలు గ్రాస్ కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది . అప్పటికి టాప్ 4 హీరోలకు మాత్రమే అలాంటి ఓపెనింగ్స్ ఉండేవి .
- 34 సెంటర్లలో 50 రోజులు , 7 సెంటర్లలో 100 రోజులు ఆడి దాదాపు 6 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది.
- తమిళ్లోకి డబ్ అయ్యి అక్కడ హిట్ అయ్యింది సిసింద్రీ .
- ఈ సినిమాలో అఖిల్ నటనకు నాలుగు ఉత్తమ బాల నటుడు అవార్డ్స్ రావడం సరికొత్త రికార్డ్ .