Advertisement
అమ్మాయిది ఒడిషా, అబ్బాయిది తమిళనాడు…ఇద్దరికీ బెంగళూరులోని ఓ కంపెనీలో జాబ్…వాళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. అదే విషయాన్ని ఇంట్లో చెప్పారు. అమ్మాయి తల్లిదండ్రులు నో అంటే నో అన్నారు…కారణం సాంప్రదాయాలు, లాంగ్వేజ్ ల తేడా.! అమ్మాయి తమ్ముడు ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు అయినా…ఆ ఫ్యామిలీ వినలేదు.!
అక్క అతన్నే పెళ్లి చేసుకుంటానంటోది.! ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు టెన్షన్ ను తట్టుకోలేక…ఆరోగ్యం పాడై హాస్పిటల్ లో చేరారు.! తమ్ముడు సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు…అతడు కూడా ఈ టెన్షన్స్ ను తట్టుకోలేక …ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టలేక సతమతమౌతున్నాడు.
Advertisement
సమయం అలా గడుస్తోంది…. 2 సంవత్సరాలైంది. తమ్ముడు సివిల్స్ లో పాస్ అయ్యి కలెక్టర్ అయ్యాడు . ఇక తానే ధైర్యం చేసి….. అక్క పెళ్లి విషయంలో వాళ్ల పేరెంట్స్ ను ఒప్పించాడు.. ఇప్పుడు వాళ్ల పేరెంట్స్ అతని మాట విన్నారు. అతనే మళ్లీ అబ్బాయి వాళ్లింటికెళ్లి వాళ్లను కూడా ఒప్పించి…. అక్క బావ ల పెళ్లిని ఇటు ఒడియా , అటు తమిళ్ ఇలా రెండు సాంప్రదాయాల్లో జరిపించాడు.

Abhinash Mishra
Advertisements
ఆ కలెక్టర్ తమ్ముడి పేరు అభినాష్ మిశ్రా…. ఒడిషా కు చెందిన అభినాష్ ప్రస్తుతం చత్తీస్ ఘర్ క్యాడర్ IAS గా పనిచేస్తున్నాడు.
Advertisements