Advertisement
క్రికెట్ చరిత్రలో సెంచరీలు , డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు . ఒకే మ్యాచ్ లో 6 సిక్స్ లు కొట్టిన ప్లేయర్స్ ని కూడా మనం చూసాము . కానీ ఎవ్వరు ఊహించని విధంగా 6 బాల్స్ కు 6 సిక్స్ లు కొట్టిన క్రికెటర్స్ మాత్రం చాలా అరుదు ఆ లిస్ట్ లో ఉన్న 5 గురు ప్లేయర్స్ వీరే.
1. హజర్థుల జజాయ్
ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఈ బ్యాట్స్ మ్యాన్ . 2018 సంవత్సరం లో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో ఖగుల్ జానన్ టీమ్ తరుపున ఆడుతూ…. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో బౌలింగ్ కి వచ్చిన అబ్దుల్లా మజారి స్పిన్ బౌలింగ్ లో 6 బాల్స్ కి 6 సిక్సులు కొట్టాడు. అంతే కాదు అదే మ్యాచ్ లో 12 బాల్స్ కి హాఫ్ సెంచరీ చేసి T20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఆఫ్ సెంచరీ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో యువరాజ్ సింగ్ మరియు క్రిస్ గేల్ పక్కన స్థానం సంపాదించాడు .
2. సర్ గ్యారీ సోబర్స్
Advertisements
వెస్టిండీస్ కి చెందిన ఈ లెజండరీ ఆల్ రౌండర్ . 1963 వ సంవత్సరం లోనే ఈ ఘనత సాధించాడు . అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్ లో 6 సిక్సులు కొట్టిన మొట్టమొదటి బ్యాట్స్ మ్యాన్ గా చరిత్ర సృష్టించాడు.
3. రవి శాస్త్రి
Advertisement
టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి ఫస్ట్ క్లాస్ క్రిక్రెట్ లో ఒకే ఓవర్ లో 6 సిక్సులు కొట్టి సొబర్స్ నెలకొల్పిన రికార్డ్ ని 16 ఏళ్ళ తర్వాత బద్దలు కొట్టాడు . 1984 లో జరిగిన రంజిట్రోఫీ లో ముంబై తరుపున బరిలో దిగిన రవిశాస్త్రి …. బరోడా బౌలర్ తిలక్ రాజ్ ఓవర్ లో 6 సిక్సులు కొట్టాడు.! ఒకే ఓవర్ లో 6 సిక్సులు కొట్టిన మొట్ట మొదటి ఇండియన్ బ్యాట్స్ మ్యాన్ గా రికార్డ్ సృష్టించాడు .
4.హెర్షల్ గిబ్స్
ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్ లో 6 సిక్సర్స్ కొట్టిన మొట్టమొదటి బ్యాట్స్ మ్యాన్ గిబ్స్ . సౌత్ ఆఫ్రికాకు చెందిన గిబ్స్ 2007 లో జరిగిన వన్ డే వరల్డ్ కప్ లో ఈ ఘనత సాధించాడు . అప్పటివరకు డొమెస్టిక్ క్రికెట్ వరకే పరిమితమైన ఈ సిక్సుల రికార్డ్ ని ఇంటర్నేషనల్ క్రికెట్ కి పరిచయం చేశాడు.
5. యువరాజ్ సింగ్
ఇంటర్నేషనల్ క్రిక్రెట్ చరిత్రలో ఒకే ఓవర్ లో 6 సిక్సులు కొట్టిన రెండవ క్రికెటర్ యువరాజ్ సింగ్. టీట్వంటీ వరల్డ్ కప్ లో ఈ ఘనత సాధించాడు యువీ! అంతేకాకుండా ఇదే మ్యాచ్ లో యువి 12 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసి మరో రికార్డ్ క్రియేట్ చేశాడు.
Advertisements