Advertisement
థియేటర్లు లేదా టీవీలు.. ఎందులో సినిమాలు చూసినా సరే.. సినిమా ఆరంభంలో నో స్మోకింగ్ యాడ్ వేస్తారు తెలుసు కదా. ఓ తండ్రి తన కూతురితో టీవీ చూస్తుంటాడు. అందులో అతను ఓ చేత్తో సిగరెట్ పట్టుకుని దాన్ని తాగుతూ కనిపిస్తాడు. దాన్ని చూసి అతని కుమార్తె ఇబ్బందిగా ఫీలవుతుంది. దీంతో ఆ తండ్రి వెంటనే సిగరెట్‌ను పారేస్తాడు. ఇదీ.. యాడ్.. అయితే ఇందులో నిజానికి మనం ఒక చిన్న విషయాన్ని గమనించవచ్చు. అదేమిటంటే…
నో స్మోకింగ్ యాడ్ ఆరంభంలో తండ్రి తన కుమార్తెతో ఉన్నప్పుడు వెనుక భాగంలో తల్లి ఏదో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడామె విచారంగా కనిపిస్తుంది. తరువాత చివరి సీన్‌లో ఆమె నవ్వుతూ కనిపిస్తుంది. తన భర్త సిగరెట్ తాగుతున్నాడని మొదట ఆమె విచారమైన ముఖంతో కనిపిస్తుంది. చివర్లో సిగరెట్ మానేసినందుకు ఆమె సంతోషిస్తూ తన కుటుంబంతో కలిసి నవ్వుతూ కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మనం ఆ యాడ్‌లో గమనించవచ్చు.
Advertisement
నిజానికి ఈ యాడ్‌ను చాలా మంది చూసి ఉంటారు. కానీ ఇప్పటి వరకు ఈ చిన్న విషయాన్ని ఎవరూ గమనించి ఉండరు. అయితే ఇందులో ఎంతో అర్థం ఉంది. సిగరెట్ కేవలం తాగేవారినే కాదు, వారి కుటుంబ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తులను మానేశాక కుటుంబ సభ్యులు ఎంతో సంతోషిస్తారు.. అనే విషయాన్ని చెప్పేందుకే ఈ యాడ్‌లో ఆయా సీన్లను పెట్టారు. దీన్ని ఇప్పటి వరకు ఎవరూ గమనించలేదు. కానీ యాడ్‌లో ఉన్న సీన్లను బట్టి మనకు ఆ విషయం ఇట్టే తెలిసిపోతుంది. కనుక పొగాకు ఉత్పత్తులను వాడడం మానేస్తే మంచిది. వారి ఆరోగ్యాలే కాదు, వారి కుటుంబాల ఆరోగ్యాలు కూడా బాగుంటాయి.
Advertisements
Advertisements