Advertisement
15 సంవత్సరాల కుర్రాడు….సైకిల్ తొక్కుకుంటూ లక్నో హై వే నుండి వెళుతున్నాడు. సైకిల్ కి రెండు వాటర్ బాటిల్స్ కట్టుకొని, ఆకలిబాధను కడుపులోనే దాచుకొని, శరీరంలోని శక్తినంతా కూడదీసుకుని….తన గమ్యం వైపు వెళుతున్నాడు. ఇతడిని గమనించిన ఓ వ్యక్తి ఇతనిని ఆపి..వివరాలు కనుక్కునే పని చేసాడు. ఆ కుర్రాడి కళ్ళల్లోకి చూస్తే ఆటో మాటిక్ గా మనకు కన్నీళ్ళొచ్చేస్తాయ్….
Advertisement
పని కోసం గుర్గావ్ వెళ్లిన ఆ కుర్రాడు లాక్ డౌన్ కారణంగా పని దొరక్క , తినడానికి తిండి దొరక్క తన స్వస్థలం అయిన బీహార్ కు సైకిల్ పై బయలుదేరాడు. గుర్గావ్ to లక్నో …558 కిలోమీటర్లు సైకిలు తొక్కుకుంటూ వచ్చేసాడు అది కూడా ఏమీ తినకుండా…. ఇంకో 600కిలోమీటర్లు వెళ్తే కానీ అతడు తన ఇంటిని చేరుకోలేడు. .. ఈ వీడియో ను తీస్తున్న వ్యక్తి కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు. అతను ఎంతగా అడిగినప్పటికీ ఈ కుర్రాడు తన ఇంటికి వెళ్ళడానికే మొగ్గు చూపాడు.
లాక్ డౌన్ కారణంగా ఇలాంటి ఎన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయ్.
Watch Video :
Advertisements
Advertisements