Advertisement
చెట్టంత కొడుకులను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్నారా..తల్లిదండ్రులు.! అయినప్పటికీ వారు మాట్లాడిన మాటలు జాతి యావత్తును గర్వంతో తల ఎత్తుకునేలా చేస్తున్నాయి. వీరులను కన్న వారిని జాతికే ధైర్యాన్నిచ్చే వారి మాటలకు సలాం.
కుందన్ కుమార్ తండ్రి :
బోర్డర్ లో ప్రాణాలు కోల్పోయిన సిపాయి కుందన్ కుమార్ తండ్రి…. ” దేశం కోసం కొడుకు చనిపోయాడు…నాకిద్దరు మనవళ్లు ఉన్నారు..వారిని సైన్యంలోకి పంపుతానన్నారు” . కుందన్ కుమార్ బీహార్ లోని సహస్ర ప్రాంతానికి చెందిన వారు. ఆయనకు ఇద్దరు కొడుకులు ..కుటుంబమంతా..ఆయన సంపాధన మీదే ఆధారపడి ఉంది.! ఆర్మీలో జాయిన్ అవ్వాలన్నది కుందన్ చిన్ననాటి కల.!
Advertisement
Watch Video:
Advertisements
సంతోష్ కుమార్ తల్లి :
ఇక కల్నల్ సంతోష్ కుమార్ తల్లైతే…. ” ఒక్కగానొక్క కొడుకును కోల్పోయినందుకు బాధగా ఉంది.. ఆ మరణం దేశం కోసమైనందుకు గర్వంగా ఉందని” చెప్పారు.సంతోష్ తండ్రి ఆర్మీలో చేరాలనుకున్నారు ..కానీ ఆయన కోరికను కొడుకు తీర్చాడు. తన క్రమశిక్షణతో అంచెలంచెలుగా కల్నల్ స్థాయికి ఎదిగాడు. సౌమ్యుడిగా మంచి పేరును సంపాధించాడు.
Watch Video:
Advertisements