Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

హీరో లేదా హీరోయిన్ చ‌నిపోయిన సినిమాలు.! థియేట‌ర్ లో ఏడిపించిన సంద‌ర్భాలివే!

Advertisement

సినిమాల్లో కామెడి సీన్స్ కి ఎంత నవ్వుకుంటామో..ఎమోషనల్ సీన్స్ కి అంతగా బాధపడుతుంటాం..ముఖ్యంగా సినిమాల్లో యాక్టర్స్ ఎవరైనా చనిపోతే  కంటతడి పెట్టుకునే ప్రేక్షకులుంటారు..అంతగా కనెక్ట్ అయిపోతూ ఉంటాం.. అలా మనల్ని బాధపెట్టి,ఏడిపించిన కొన్ని సినిమాలు ,ఆ సినిమాల్లోని పాత్రలు ఏవో చూద్దాం..

భీమిలి కబడ్డి జట్టు – నాని

ఒకటి రెండు సినిమాల్లో కాదు ఏకంగా నాలుగు సినిమాల్లో నాని చనిపోయే పాత్రల్లో నటించాడు..అవి భీమిలి కబడ్డి జట్టు,జెర్సీ,ఈగ మరియు జెంటిల్ మాన్..అన్నింట్లోకి భీమిలి కబడ్డి జట్టు క్లైమాక్స్ మన చేత కంటతడి పెట్టిస్తుంది.

గోరింటాకు – రాజశేఖర్,మీరాజాస్మిన్

Advertisements

అన్నా చెల్లెల్ల సెంటిమెంట్ తో వచ్చిన గోరింటాకు సినిమా సెన్సేషనల్ హిట్ సాధించింది..ఈ  సినిమాల్లో అన్నా చెల్లెల్లుగా నటించిన మీరా జాస్మిన్,రాజశేఖర్ ఇద్దరూ చనిపోయే  సీన్ చూసిన కంటతడి పెట్టని ప్రేక్షకుడుండడంటే అతిశయోక్తి కాదు..ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ నెగటివ్ రోల్ పోషించింది.

గమ్యం – అల్లరి నరేష్

గాలి శీను..పాత్రలో ఒదిగిపోయిన అల్లరి నరేష్ మరణం ఆ సినిమాలో శీను ఫ్రెండ్ గా నటించిన  శర్వానంద్ నే కాదు,మనల్ని ఏడిపించేస్తుంది.

నిన్నే ప్రేమిస్తా – నాగార్జున

ప్రత్యేక పాత్రలో కాసేపే కనిపించినప్పటికి ఈ సినిమాలో నాగార్జున మరణం బాధపెడుతుంది..నాగ్ మరణంతో తన జ్ణాపకాల్లోనే బతికే ప్రియురాలి పాత్రలో సౌందర్య నటించింది..నాగ్ కోసం హాస్పిటల్లో సౌందర్య ఏడ్చే సన్నివేశం మనతో కన్నీరు పెట్టిస్తుంది. మరో హీరోగా శ్రీకాంత్ కనిపిస్తాడు.

వేదం – అల్లు అర్జున్, మనోజ్

వేదం సినిమాలో నటించిన అల్లు అర్జున్,మనోజ్ ఇద్దరు చనిపోతారు..ఆ సీన్ చూస్తే ఏడవకుండా ఉండలేం..అందరిని రక్షించడానికి వాళ్లిద్దరూ ప్రాణాత్యాగానికి సిద్దమవుతున్నారనే విషయం తెలియగానే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి..

గజిని – ఆసిన్

బ్లాక్ బస్టర్ హిట్ మూవి గజినిలో ఆసిన్ చనిపోయే సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.

Advertisement

పౌర్ణమి – త్రిష

పౌర్ణమి సినిమాలో త్రిష చనిపోయేటప్పుడు మనకి తెలియకుండానే బాధకలుగుతుంది..ఎమోషనల్ అయిపోతాం.

అంత:పురం – జగపతిబాబు

అంత:పురం సినిమాలో జగపతిబాబు చనిపోయే సీన్ చాలా బాధపెడుతుంది.

బాహుబలి – ప్రభాస్

అమరేంద్ర బాహుబలి పాత్రలో నటించిన ప్రభాస్ కట్టప్ప చేతిలో చనిపోతాడు..ఆ సీన్ కంటతడి పెట్టిస్తుంది.

ఓయ్ – షామిలి:

లైఫ్ ఈజ్ షార్ట్..సో ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రి మూమెంట్ అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా తెలుస్తుంది.ఈ సినిమాలో షామిలి చనిపోయే సీన్ నేరుగా చూపించకపోయినా సిద్దర్ద్ ఎక్స్ప్రెషన్లో ఆ బాధని మనం కూడా ఫీల్ అవుతాం.

 

రాజా రాణి – నజ్రియా:

ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు అనడానకి రాజారాణి సినిమాలో నజ్రియా మరణించే సీన్ ఎగ్జాంపుల్..అప్పటివరకు సంతోషంగా ఉన్నప్రేమ జంట..యాక్సిడెంట్ కారణంగా నజ్రియా చనిపోతుంది..ఆ సీన్ కి ఆర్యతో పాటు మనం కూడా ఏడ్చేస్తాం.

ఒక ఊరిలో – తరుణ్:

తరుణ్ సినిమాల్లో ది బెస్ట్ మూవీ ఒక ఊరిలో.. ఈ సినిమాలో తరుణ్ చనిపోయాడనే విషయం తెలుసుకుని జీర్ణించుకోలేకపోతాం.

దీర్ఘసుమంగళి భవ:

సినిమా మొదటి నుండి కూడా పొగరుగా బిహేవ్ చేసే రమ్యకృష్ణని చూస్తే కోపంతో ఊగిపోతాం..కానీ క్లైమాక్స్ లో తను చనిపోయినప్పుడు మాత్రం ఎమోషనల్ అయిపోతాం.

 

Advertisements