Advertisement
డాక్టర్ కొడుకు డాక్టర్, యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వగాలేనిది….. క్రికెటర్ కొడుకు క్రికెటర్ అవ్వడంతో తప్పేంటి? అంటూ తమ కొడుకులను కూడా తాము రాణించి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన అదే రంగంలోకి దింపుతున్నారు స్టార్ క్రికెటర్లు! ఆ లిస్ట్ ను ఇప్పుడు చూద్దాం!
1. అర్జున్ టెండూల్కర్:
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ . తన తండ్రి చరిత్రని తిరగరాయడానికి సిద్ధం అవుతున్నాడు . కాకపోతే తండ్రి బ్యాట్ తో రికార్డ్ లు సృష్టిస్తే కొడుకు బాల్ ను అందుకున్నాడు…. అర్జున్ టెండూల్కర్ మంచి ఫాస్ట్ బౌలర్.
Advertisements
2. సౌమిత్ ద్రావిడ్:
దివాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గా పేరుగాంచిన రాహుల్ ద్రావిడ్ కొడుకు సౌమిత్ ద్రావిడ్ కూడా క్రికెటర్ నే కెరీర్ గా ఎంచుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే తండ్రి సలహాలను తీసుకుంటూ నెట్ లో ఎక్కువ టైమ్ ప్రాక్టీస్ చేస్తున్నాడట! మరి తండ్రిలాగా బ్యాట్స్ మన్ గా రాణిస్తాడా? బౌలర్ గా మారతాడా చూడాలి!
3. ఆర్యన్ బంగర్:
Advertisement
మాజీ ఇండియన్ టెస్ట్ ఓపెనర్ మరియు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు, ఆర్యన్ బంగర్… డొమెస్టిక్ సర్క్యూట్లో తన అద్భుతమైన ప్రదర్శనలతో న్యూస్ హెడ్ లైన్స్ లో కనిపిస్తుంటాడు. త్వరలోనే ఇండియన్ టీమ్ లో చూడబోయే ఆటగాడు ఇతను.!
4. రిలే మెక్కల్లమ్:
బ్రెండన్ మెక్కల్లమ్ కుమారుడు రిలే మెక్కల్లమ్. రిలే తండ్రిలాగే హార్డ్ హిట్టర్.
5. థాండో ఎన్తిని:
సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ మఖాయ ఎన్తిని కుమారుడు థాండో ఎన్తిని. తండ్రిలాగే బౌలింగ్ లో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం అండర్ 14 లో ఆడుతున్నాడు.
6. ఆస్టిన్ వా:
ఆస్టిన్ వా స్టీవ్ వా కుమారుడు. తండ్రి బ్యాట్స్ మన్ కానీ ఆస్టిన్ వా ఆల్ రౌండర్… ఇతని బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా తండ్రిని పోలే ఉంటుంది
Advertisements