Advertisement
దైవం మానుష్య రూపేణా…అంటూ సోనూ సూద్ ని దేవుడంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. సుమారు నాలుగు నెలలుగా ఒకటే పనిలో ఉన్నాడు సోనూ.. కష్టాల్లో ఉన్న వారిని తన దృష్టికి వచ్చిన మరుక్షణం సాయం చేస్తూ ఆపధ్బాందవుడిలా మారాడు.. అయితే అందరికి ఒకటే డౌట్ ఇంత సాయం చేస్తున్నాడు..అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి..అసలు సోను ఆస్తుల విలువెంత అని..
సోనూసూద్ పుట్టింది ఎగువ మధ్యతరగతి కుటుంబంలో తండ్రి బట్టల వ్యాపారి, తల్లి ప్రొఫెసర్.. సో ఏ ఢోకాలేదు.. అయినప్పటికి కాలేజి డేస్ నుండి తన ఖర్చులకు తనే సంపాదించుకోవడం సోనూ అలవాటు..చదువుకునే రోజుల్లో మోడల్ గా చేసి సంపాదించగా వచ్చిన డబ్బుతోనే బతికాడు.తర్వాత అవకాశాల కోసం ముంబై వచ్చాక ఎన్ని కష్టాలు పడ్డా ఇంట్లో నయాపైసా అడగలేదు..అప్పటికే పెళ్లై ఉంది.. అప్పుడు భార్య భర్తలిద్దరూ ఎవరి ఉద్యోగాలు వాళ్లు చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు తప్ప కుటుంబాలపై ఆధారపడలేదు.
Advertisement
సోనూ సిని కెరీర్ స్టార్ట్ ఇరవై ఏళ్లు కావస్తోంది.. తొలి రోజుల్లో అవకాశాలు, రెమ్యునరేషన్ అంతంత మాత్రంగానే ఉన్నా అతి తక్కువ కాలంలోనే సౌతిండియాలో విలన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.. రెమ్యునరేషన్ కోట్లలోనే తీసుకునేవాడు..కుటుంబానిదెలాగు బిజినెస్ బ్యాక్ గ్రౌండ్..దాంతో సినిమాల్లో సంపాదించిన డబ్బుల్ని వచ్చినవి వచ్చినట్టు ఖర్చు పెట్టేయకుండా బిజినెస్ వైపు మళ్లించాడు..వివిధ నగరాల్లో హోటల్ బిజినెస్ లు ప్రారంభించాడు..స్థిరాస్తులు సంపాదించాడు..ప్రస్తుతం సోనూ ఆస్తుల విలువ 130కోట్ల రూపాయలని అంచనా.. ఇప్పటివరకు 10కోట్ల వరకు ఖర్చు చేశాడు..ఇకముందు చేయడానికి సిధ్దంగా ఉన్నాడు.
కరోనా తొలిరోజుల్లో ముంబైలోని తన హోటల్ డాక్టర్లు,పోలీసులు,పారిశుధ్యకార్మికులకు వాడుకొమ్మంటూ ఇచ్చేశాడు.. నేను వలస కూలినే, అవకాశాల కోసం సొంత ఊరు వదిలి ముంబై వచ్చాను.. ఆ కష్టం నాకు తెలుసు అంటూ వలస కూలిలను వారి ప్రాంతాలకు చేర్చాడు.. నిన్నటికి నిన్న తెలుగు రాష్ట్రాల్లో సోనూ పేరు మారుమోగిపోయింది.. ఎద్దుల స్థానంలో కూతుర్లతో పొలం దున్నుతున్న రైతుకి ట్రాక్టర్ ని పంపించాడు. అంతేకాదు, సాప్ట్ వేర్ శారదకి సాయం చేస్తానంటూ హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు. తెలుగు ప్రజల మనసే కాదు యావత్ దేశస్థుల మనసు గెలుచుకున్నాడు.. ప్రభుత్వాలు, స్టార్ హీరోలు.. అపర కుబేరులు సైతం చేయలేని పనిని సోనూ ఒక్కడే చేస్తున్నాడు..
Advertisements
Advertisements