Advertisement
కంటికి కనిపించని చిన్న వైరస్ ఎందరి జీవితాలతోనో ఆడుకుంది..హఠాత్తుగా ప్రకటించిన లాక్డౌన్ తో పనులు లేక పస్తులతో అల్లాడలేక పొట్టచేతపట్టుకుని పట్నం వచ్చిన పేదలే, మళ్లీ అదే పొట్ట చేతపట్టుకుని సొంతూరి బాట పట్టిన వైనం.. వేలకిలోమీటర్లు, కాలినడకన ప్రయాణం..కొందరు ఆ సాహసం చేయలేక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి..అప్పుడు వచ్చాడు హఠాత్తుగా..మనకు తెలిసిన సోనూసూదే..
కానీ ఒకప్పుడు విలన్ గా మనకు తెలిసిన సోనూ..ఇప్పుడు సాక్షాత్తూ దేవుడిగా వచ్చాడు..ఎందరికో ఆపన్నహస్తం అందించాడు..ఆకలి తీర్చాడు,ఇళ్లకు చేర్చాడు.ఇళ్ల దగ్గరకష్టపడుతున్న వారికి సాయం చేశాడు..టివిల్లో ,సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా చలించిపోయాడు.. వాళ్ల డీటెయిల్స్ తీసుకోవడం తక్షణమే తన సాయం అక్కడ ప్రత్యక్షమవడం..మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పేద రైతు కుటుంబం, సాప్ట్ వేర్ శారద సోనూ సాయం చేసినవాళ్లే..
Advertisement
ఒక చిన్న మెసేజ్ చేసినా చాలు..నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నాడు..మొదట్లో వందల సంఖ్యల్లో వచ్చిన ఈ మెసేజ్ల సంఖ్య ఇప్పుడు వేలకు చేరింది.. సోనూకి ప్రతి రోజు ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో ఎక్స్పెక్ట్ చేయగలరా??కష్టాల్లో ఉన్నాం రక్షించమంటూ సోనూకి రోజుకి వచ్చే మెసేజ్ల సంఖ్య సుమారు 30వేల పైనే… ఒకరోజు పాటు తనకొచ్చిన మెసేజ్ల సంఖ్యనే తనే ట్వీట్ చేశాడు..వాటి సంఖ్య ఎలా ఉందంటే..
Advertisements
ట్విటర్-6741
మెయిల్ – 1137
ఫేస్ బుక్ – 19000
ఇన్స్టాగ్రాం మెసేజ్లు-4812
ఇన్ని మెసేజ్లు చూసి చదివి,వాటికి రెస్పాండ్ అయి సాయం చేయడం మనిషి అనే వాడి వల్ల సాధ్యం కాదు, అయినా కూడా వీలైనంత ఎక్కువమందికి సాయం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నాను అని.. ఇన్ని మెసేజ్లు చదవడం కష్టంగా ఉంది కాబట్టి ఎవరికైనా సాయం అందకపోతే క్షమించండి అంటూ వినమ్రంగా ఒక ట్వీట్ చేశాడు..
Advertisements
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు..సోనూ ఓపికకు,మానవతాగుణానికి,మంచి మనసుకి జోహార్ చెప్తూ..మీరు ఒక్కరూ చేయడం కష్టం..పాలిటిక్స్ లోకి రండి సర్, లేకపోతే ఏదన్నా సంస్థను పెట్టండి సార్..వారితో పనులు చేయించండి అంటూ కామెంట్ చేస్తున్నారు.. యాక్టింగ్ అంటే నాకు ఇష్టం, యాక్టర్ గా ఉంటూనే సాయం చేయొచ్చు.పాలిటిక్స్ లోకి రావాల్సిన అవసరం లేదు అని అప్పట్లో ప్రకటించాడు.. మరి సోనూసూద్ ఏం చేస్తాడో..!