Advertisement
సౌత్ కొరియాలో ఆధునికత మరియు ప్రాచీనతను కలగలిసిన నియమాలను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా గర్భావతిగా ఉన్నప్పుడు అక్కడి మహిళలకు ఆ ప్రభుత్వం ఇచ్చే ఇంపార్టెన్స్ ను చూస్తే ఆశ్చర్యపోతారు.
- ప్రెగ్నెంట్ లేడీస్ కు సౌత్ కొరియా ప్రభుత్వం…500$ క్రెడిట్ కార్డ్ ను ఇస్తుంది. దీంతో వాళ్లు మెడిసిన్ తో పాటు ఇతర అవసరమైన వస్తువులను కొనుగోళు చేసుకోవొచ్చు.! కాన్పు తర్వాత తిరిగి ఆ డబ్బు చెల్లించలేని పక్షంలో…ప్రభుత్వం ఆ అప్పును రద్దు చేస్తుంది. అంతేకాకుండా….గర్భావతులకు ప్రత్యేకమైన పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి.! ఆ స్లాట్స్ లో ఇతరులు ఎవ్వరూ పార్క్ చేయకూడదు.!
- ప్రతి బస్ హాల్ట్ వద్ద…ఏ బస్ ఎప్పుడు వస్తుంది…ప్రస్తుతం ఆ బస్ ఎక్కడ ఉంది అనే విషయాలను డిజిటల్ డిస్ ప్లే ద్వారా చూపుతారు! అక్కడి బస్సులు 24*7 నడుపుతారు…డ్రైవర్లు యూనిఫామ్ చేతులకు గ్లౌసులు ధరించి ఉంటారు!
Advertisement
- సూపర్ మార్కెట్ లలో….పండ్ల ముందు శాంపిల్ పీస్ లు కట్ చేసి పెడతారు. తిన్న తర్వాత మీకు టేస్ట్ నచ్చితేనే కొనొచ్చే…లేదంటే లైట్ తీసుకోవొచ్చు!
- గృహప్రవేశాలకు ఆహ్వనించినప్పుడు…ఆహ్వానితులు వారికి కావాల్సిన వస్తువులు తలాఒకటి చొప్పున తీసుకెళతారు. కొంతమంది పప్పు, ఇంకొంతమంది బియ్యం, నూనె, షూ పాలిష్, టాయిలెట్ పేపర్స్….ఇలా ఇంట్లో వాడే వస్తువులను గిఫ్ట్ లుగా ఇస్తుంటారు.!
- సౌత్ కొరియన్ టీవీ యాంకర్స్….నూతన సంవత్సరం నాడు తప్పకుండా వారి సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించాలి!
Advertisements
- కిండర్ గార్డెన్ స్కూల్ లో….ప్రతి క్లాస్ పిల్లలకు డిఫరెంట్ కలర్ యూనిఫామ్ ను పెడతారు. ఒకవేళ పిల్లలు గుంపులో తప్పిపోయినా….ఈజీగా గుర్తుపట్టొచ్చు.!
Advertisements