Advertisement
“ఏ వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అయ్యామో..అదే వ్యక్తి చేతుల మీదుగా బాద్యతలు స్వీకరించడాన్ని మించిన ఆనందం, అదృష్టం ఇంకేం ఉంటుంది..” ప్రస్తుతం అదే ఆనందంలో ఉంది కోజికోడ్ అసిస్టెంట్ కలెక్టర్ గా బాద్యతలు స్వీకరించిన శ్రీధన్య. కేరళలోని వయనాడ్ కి చెందిన శ్రీధన్య..కేరళ రాష్ట్రం నుండి సివిల్స్ సాధించిన తొలి గిరిజన మహిళ.
పిజి తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు ఫస్ట్ టైం కలెక్టర్ కావాలనే ఆలోచన కలిగింది….అందుకు కారణం అప్పటి అసిస్టెంట్ కలెక్టర్ శ్రీరాం సాంబశివరావు..ఆ రోజు అతను మా ఆఫీస్ కి వస్తున్నాడని ..ఆఫీస్ వాళ్లు చేసిన హడావిడి, ఎదురు చూపులు చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది..అతనొచ్చిన తర్వాత అతడికి అందరూ ఇచ్చిన మర్యాద చూస్తే నాక్కూడా గౌరవ మర్యాదలు పొందాలనిపించింది.. అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నాను ఐఏఎస్ కావాలని..
కట్ చేస్తే…
కోజికోడ్ కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్ బాద్యతల్లో శ్రీరాం సాంబశివరావు.. అతడి చేతుల మీదుగా శ్రీధన్య సురేశ్ అసిస్టెంట్ కలెక్టర్ గా బాద్యతలు స్వీకరించింది.. కోజికోడ్ తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది..నేను ఇక్కడే చదువుకున్నాను..కోవిడ్-19లాంటి విపత్తుని ఎదుర్కొంటున్న సమయంలో విధుల్లో చేరడం సంతోషంగా ఉంది..నా బాద్యతను నెరవేరుస్తాను అంటూ చెప్పుకొచ్చింది శ్రీధన్య..
Advertisements
Advertisement
కేరళలోని వయనాడ్ ఇడియం వాయల్ గ్రామానికి చెందిన శ్రీధన్య..తల్లిదండ్రులు రోజువారి కూలీలు కమల, సురేశ్..చిన్నప్పటి నుండి ఆర్ధిక ఇబ్బందులు తప్ప మరెలాంటి ఆంక్షలు ఎదుర్కోలేదు శ్రీధన్య..చదువెందుకు,ఉద్యోగం ఎందుకు అనే మాటలెప్పుడూ వినలేదు..పిజి వరకు చదువుకుంది..జువాలజిలో పిజి చేసిన శ్రీధన్య చిన్న ఉద్యోగంలో జాయిన్ అయింది..

IAS శ్రీధన్య ఇల్లు
కలెక్టర్ కావలని కోరిక కలగడంతో ఒక్కసారిగా కుటుంబ ఆర్ధిక పరిస్థితి కళ్లముందు కదిలింది..కానీ తనలో ఉన్న తపన,కోరిక వాటన్నింటిని ఎదుర్కొనే శక్తిని ఇచ్చింది..కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ విద్యార్దులకు అందచేసే ఫ్రీ స్కాలర్ షిప్ తో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయి..ఆ స్కాలర్ షిప్ తోనే చదువుకుని కష్టపడి చదివింది.సెలక్ట్ అయితే చాలు ర్యాంక్ లతో సంబంధం లేదు అన్నట్టుగా చదివింది.. . సివిల్స్ లో 410 ర్యాంక్ కొట్టి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది..ప్రస్తుతం కోజికోడ్ అసిస్టెంట్ కలెక్టర్ గా బాద్యతలు చేపట్టింది.
Advertisements