Advertisement
సినిమా నిర్మాణంలో …… కాస్ట్యూమ్స్ కు సెపరేట్ బడ్జెట్ ఉంటుంది! ఇది హీరో హీరోయిన్ లను బట్టి, వారికున్న డిజెనర్స్ ను అభిరుచిని బట్టి పెరుగుతుంది. స్టార్ హీరోలకైతే ఈ బడ్జెట్ 40 లక్షలకు పైనే ఉంటుంది. కొత్తవాళ్ల కాస్ట్యూమ్ కైతే 10 లక్షల లోపు ఖర్చు అవుతుంది!
ఇంతకు ముందు….?
ఇంతకు ముందు షూటింగ్ కోసం హీరోహీరోయిన్ల బట్టలను అద్దెకు తీసుకునేవారు. షూటింగ్ తర్వాత తిరిగి ఆ బట్టలు వారికి ఇచ్చేవారు. కాలక్రమేణా పెద్ద పెద్ద హీరోలు అద్దె బట్టలు తొడగడానికి నో చెప్పడం, పెద్ద హీరోలు వాళ్ళ కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్ డిజైనర్స్ ను నియమించుకోవడం, ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారిపోతుండడంతో హీరోలే తమకోసం తమ డిజైనర్లతో ప్రత్యేక దుస్తువులు రూపొందించుకుంటున్నారు. దీంతో ఖర్చు పెరిగిపోయింది. పాతకాలపు హీరోయిన్స్ పేరు మీద చీరలు , చెవి దిద్దులు, వారు పెట్టుకునే కాటుకతో సహా వారి పేరు, సినిమా పేరుతో సహా ఫేమస్ అయ్యేవి.!
Advertisement
డిజైనర్స్ పని?
డైరెక్టర్ సీన్ ను వివరించాక…ఆ సీన్ లో తమ హీరోకి లేదా హీరోయిన్ కి ఎలాంటి డ్రెస్స్ నప్పుతుందని అనేక విధాలుగా ఆలోచించి డిజైనర్ …ఆ సీన్ కు తగ్గ బట్టలను స్వయంగా తానే డిజైన్ చేయడమో లేకపోతే కొనడమో, ఇంకా గ్రాండ్ గా కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవడమో జరుగుతుంది.( ముందుగానే మాట్లాడుకున్న ప్యాకేజీ లో భాగంగానే)
Advertisements
షూటింగ్ అయ్యాక ఆ బట్టల పరిస్థితేంటి?
1) హీరోకి, హీరోయిన్స్ కి బాగా నచ్చిన బట్టలను వారు తీసుకెళతారు
2) షూటింగ్ అయ్యాక ఆ బట్టలను సెకెండ్స్ లో అమ్మేస్తారు.
3) ట్రెండ్ సెట్ చేసిన హీరో కాస్ట్యూమ్ ను వేలం వేసి,అలా వచ్చిన డబ్బును ఛారిటీకి ఇస్తారు.
4) ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు తీసే నిర్మాతలైతే….ఆ డ్రెస్సులను భద్రపరిచి తన నెక్ట్స్ మూవీలో ఇతర ఆర్టిస్ట్ లకు వాడతారు.
Advertisements
సీరియల్స్ లో కాస్ట్యూమ్ కు బడ్జెట్ కేటాయించరు…ఎవరి డ్రెస్ వాళ్లు తెచ్చుకోవాల్సిందే!