Advertisement
ఆక్యుప్రెషర్ అంటే మసాజ్ లాంటి చికిత్స…. శరీరంలోని కొన్ని ప్రత్యేకమైన పాయింట్స్ ను ఉత్తేజ పర్చడం ద్వారా….సంబందిత రోగాలను నయం చేస్తారు.! అలాంటి ఆక్యుప్రెషర్ ద్వారా నత్తిని కూడా పొగొట్టుకోవొచ్చట.! ఈ పద్దతిని 30 రోజులు పాటిస్తే….నత్తి కాస్త తగ్గే అవకాశముందట!
దవడ కింది భాగంలో మూడు ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి . వాటిని ఇంగ్లిష్‌లో Three needle of Jin అంటారు….వాటిని ప్రేరేపించాల్సి ఉంటుంది.
కుడిచేతిని ఎదుటివైపు చూపుతున్నట్టుగా చాచి..బొటన వేలు మరియు చిటికెన వేలును టచ్ చేయండి. ఇప్పుడు మిగిలిన మూడు వేళ్లను దవడ కింది భాగంలో పెట్టి…5 నిమిషాల పాటు మెల్లిగా మసాజ్ చేయండి.! చూపుడు వేలి దగ్గర ఒక పాయింట్, మధ్య వేలి దగ్గర మరో పాయింట్, ఉంగరపు వేలి దగ్గర ఇంకోపాయిట్….. Three needle of Jin ను యాక్టివేట్ చేస్తూ ఉంటాయి.! దీంతో మాట్లాడే శక్తికి సంబంధించిన నరాలు ఉత్తేజితమై… క్రమంగా నత్తి తగ్గే అవకాశం ఉంటుంది. చైనీస్ సాంప్రదాయ వైద్యంలో ఈ థెరపీని ఎప్పటి నుంచో పాటిస్తున్నారట.!
Advertisement
నత్తి ఎందుకు వస్తుంది:
మనం మాట్లాడేటప్పుడు అక్షరాలు ఒకదాని తరువాత మరోటి నిర్దిష్ట సమయంలో ఉచ్చరించడం వలన ఇతరులకు ఆ ధ్వనులు స్పష్టంగా వినిపిస్తాయి. ఊపిరితిత్తుల నుండి బయటకు వచ్చేగాలి, స్వరపేటికలోని స్వరతంత్రుల ప్రకంపనలతో స్వరంగా మారి బయటకు వచ్చునప్పుడు నాలుక పలు విధాలుగా కదిలించడం వలన అనేక శబ్దాలు ఉచ్చరించగలుగుతాము. ఈ ప్రక్రియ మొత్తం మెదడు కంట్రోల్ లో అతివేగంగా జరుగుతూ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే పూర్తవుతుంటుంది. అయితే ఈ ప్రక్రియలో ఒక్కోసారి కొన్ని అసమానతలు తలెత్తి స్వరతంత్రులు సరైన సమయానికి తెరచుకోకపోవడం, నాలుక నిర్దిష్ట సమయంలో కదలకపోవడం లేదా నాలుక ఒకే చోట ఎక్కువ సేపు ఉండిపోవడం వలన శబ్దాలు, పదాలు, వాక్యాలు ఆగి ఆగి రావడం లేదా అవే ధ్వనులు మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది.
Advertisements
నత్తి ఏ వయస్సులో వస్తుంది:
చాలామందిలో నత్తి సమస్య చిన్న వయస్సులోనే మొదలవుతుంది. చాలా అరుదుగా కొద్దిమందిలో మాత్రం మెదడుకు సంబంధించిన జబ్బుల వల్ల మధ్యలో కూడా రావచ్చు. ఈ సమస్య అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువగా వస్తుంది.
నత్తిని తగ్గించుటకు:
నత్తి మందులు శస్త్ర చికిత్సల వలన నయం కాదు, కాని వారిలో మానసిక ఒత్తిడిని, భయాన్ని తగ్గించే ప్రత్యేక చికిత్సా విధానం ద్వారా నత్తిని నయం చేయవచ్చు. ఈ ప్రత్యేక చికిత్సా విధానంలో మాట్లాడే క్రమంలో స్వరతంత్రులు, నాలుక, పెదవుల కదలికలు, గాలి సరఫరాలోని అసమానతలు సరిచేయడం, వాటిని సమన్వయంతో పని చేయించగలడం జరుగుతుంది, తద్వారా నత్తి ఉన్నవారు మామూలుగా మాట్లాడగలుగుతారు.
Advertisements