Advertisement
ఉదయం నుండి సోషల్ మీడియా లో ఈ ఫోటో సర్క్యూలేట్ అవుతుంది. లాక్ డౌన్ తర్వాత మొదటి ట్రైన్ నడుపుతున్న తన భర్తకు జాగ్రత్తలు చెబుతున్న భార్య అంటూ ఈ ఫోటో షేర్ అవుతుంది. నిజానికి ఈ వార్త ఫేక్….ఇది గత ఏడాది రాఖి పౌర్ణమి రోజుది.
Advertisement
ఈ ఫోటో లో ఉన్నది భార్యాభర్తలు కాదు …అక్కాతమ్ముళ్లు. రాఖి పౌర్ణమి రోజు తమ్ముడికి రాఖి కట్టాలని అక్క ఇంటికొచ్చింది కానీ తమ్ముడు డ్యూటీ లో ఉన్నాడని తెలిసింది . ఇండియన్ రైల్వే లో లోకో పైలెట్ గా పనిచేస్తున్న అతను …ఆ రోజు మధ్యప్రదేశ్ లోని ఇటార్సీ – బసవాల్ రూట్ ట్రైన్ నడుపుతున్నాడు. ఈ రెండు రూట్ల మధ్యలోని బుర్హాన్ పూర్ లో ట్రైన్ 2 నిముషాలు ఆగుతుందని తెలుసుకొని …అక్క డైరెక్ట్ గా ఆ స్టేషన్ కు వెళ్లి తమ్ముడికి రాఖీ కట్టింది.! ఆ సందర్బంగా తీసిన ఫోటో ఇది.
Advertisements
Advertisements