Advertisement
ఈ ఫోటోలో కనిపిస్తున్నాయన పేరు మియాఖాన్…. ఈయన ప్రతి రోజు తన ముగ్గురు కూతుర్లను తన బైక్ మీద ఎక్కించుకొని 12 కిలోమీటర్లు ప్రయానం చేసి.. ఈ స్కూల్ లో దించుతాడు. అంతే కాదు స్కూల్ చివరి బెల్ కొట్టే వరకు అక్కడే ఉంటాడు. స్కూల్ అయ్యాక తన కూతుళ్లను తీసుకొని ఇంటికి వెళతాడు.
Advertisement
ఇది మనకు సాధారణ విషయమే కావొచ్చు..కానీ స్త్రీ విద్య నిషేధంగా ఉన్న అఫ్ఘనిస్తాన్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా ధైర్యంతో కూడుకున్న పని.! స్త్రీ కేవలం వంటింటికి మాత్రమే పరిమితమని ఫత్వాలు జారీ చేసే ప్రాంతాల్లో ఇది అత్యంత సహాసమైన విషయం. ఈ విషయాన్ని గురించి మియాఖాన్ ను ప్రశ్నిస్తే…”మా ప్రాంతంలో డాక్టర్లు లేరు…అందుకే నా కూతుర్లను డాక్టర్ చేయాలని చదివిస్తున్నాను. నాకంటే చదువు రాదు…వీరి చదువు మా ప్రాంతానికి ఎంతో అవసరం’ అంటాడు
Advertisements
Advertisements