Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

అక్క‌ను చూడ‌డానికొచ్చి న‌న్ను చేసుకున్నాడు…. 14 ఏళ్ల‌కే న‌ర‌కంలోకి ఎంట‌రైన‌ నా లైఫ్ స్టోరి!

Advertisement

నాకు 14 ఏళ్లు, అక్క‌కు 16…..మా త‌ర్వాత ఇంకా ఇద్ద‌రు చెల్లెల్లున్నారు. అందుకే అక్క పెళ్లిచేసేందుకు అమ్మానాన్న ఓ సంబంధాన్ని వెతికారు. అత‌డికి 30 ఏళ్లు…అప్ప‌టికే పెళ్లైంది కానీ ప్ర‌స్తుతం అత‌ని భార్య అత‌నితో లేదు.

అక్క‌ను చూడ‌డానికి వాళ్లు ఇంటికొచ్చారు. ఎర్ర‌చీర‌లో ముస్తాబైన అక్క వారికి టీ అందించింది. అక్క‌తో పాటు నేను అక్క‌డే కూర్చున్న‌…. ఇంటికెళ్లి పెళ్లి గురించి చెబుతామ‌న్న వాళ్లు….ఇంటికెళ్లాక అక్క‌ను కాకుండా న‌న్ను చేసుకుంటామ‌ని చెప్పార‌ట‌! ఎవ‌రిదో ఓ ఆడ‌పిల్ల పెళ్ల‌వుతుంది , భారం దిగుతుంది క‌దా అని భావించిన మా పేరెంట్స్ ఓకే చెప్పారు… పెళ్లిచూపుల‌కు అక్క వేసుకున్న ఎర్ర‌చీర ….నా పెళ్లిచీర అయ్యింది.


మొద‌టి రాత్రి…. న‌న్ను వివ‌స్త్ర‌ను చేసిన అత‌ను నా నొప్పిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా అత‌డి కోరిక‌ను తీర్చుకున్నాడు. నాజీవితంలో అత్యంత బాధ‌ను అనుభ‌వించింది అప్పుడే. అలా ప్ర‌తిరోజూ వాడి కోరిక తీర్చ‌డం కోసం నా ఆడ‌త‌నం ర‌క్త‌మోడేది.

Advertisement

16 ఏళ్ల‌కు గ‌ర్భ‌వ‌తిన‌య్యాను… అయినా వాడి కామం త‌గ్గ‌లేదు….దాంతో గ‌ర్భాన్నే కాదు పూర్తిగా పిల్ల‌లు పుట్టే అవ‌కాశాన్నే కోల్పోయాను నేను. ఎన్నో సార్లు అమ్మానాన్న‌ల‌కు చెప్పినా ఇంకా ముగ్గురు ఆడ‌పిల్ల‌లున్నారు….వారి పెళ్లిళ్లు చేయాలి….నువ్వు అక్క‌డే ఉండాల‌ని చెప్పుకొచ్చారు.

ఆ న‌ర‌కంలో అలాగే రెండేళ్లు గ‌డిచాయి. పిల్ల‌లు పుట్ట‌డంలేద‌ని తిడుతూ నా భ‌ర్త న‌న్ను కొడుతున్నాడు…. 4 ఏళ్లుగా అణుచుకున్న కోపం ఒక్క‌సారిగా ఉబికొచ్చింది….. బ‌లంగా లాగి అత‌ని చెంప‌మీద ఒక్క‌టిచ్చాను. అత‌ను జుట్టు పట్టుకొని క‌డుపులో త‌న్నాడు….. కూర‌గాయ‌ల క‌త్తి చేతిలోకి తీసుకొని అత‌డిని బెదిరించి క‌ట్టుబ‌ట్ట‌ల‌తో ఆ న‌ర‌కం నుండి బ‌య‌టికి ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చాను.

Advertisements

Advertisements

ఎక్క‌డికెళ్లాలో తెలియ‌దు…త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు మాత్రం వెళ్లొద్ద‌నుకున్నాను. ఓ పెద్ద బ‌ట్ట‌ల షాప్ లో ప‌నికి కుదిరాను. వ‌చ్చిన డ‌బ్బుల‌ను కూడ‌బెట్టుకుంటున్నాను…ఇప్పుడు రాత్రుల్లో ప్ర‌శాంత‌మైన నిద్ర‌లు త‌ప్ప ర‌క్త‌మోడే న‌ర‌కాలు లేవు. ఇదొక్క‌టి చాలు నేను చేసింది మంచిప‌ని అనుకోడానికి.! మా షాప్ లోనే ప‌నిచేస్తున్న ఓ అబ్బాయి నన్ను ఇష్ట‌ప‌డుతున్నాని ప్ర‌పోజ్ చేశాడు, నాకు అత‌నంటే ఇష్ట‌మే కానీ నా భ‌యంక‌ర‌మైన గ‌తాన్ని అత‌నికి చెప్పాలా? వ‌ద్దా…? అని ఆలోచిస్తున్నాను. చెబితే అత‌డి రియాక్ష‌న్ ఎలా ఉంటుందో ఏమో?