Advertisement
మా తాత, నానమ్మ బన్ను అనే ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఇది పాకిస్థాన్‌లోని ఖైబర్ పాక్ తున్క్వా అనే ప్రాంతంలో ఉంది. అదో అందమైన లోయ ప్రదేశం. 1947లో ఇండియా, పాకిస్థాన్ విడిపోయాక జరిగిన అల్లర్ల కారణంగా…..సామాన్లలను అక్కడే వదిలేసి భయంతో …..కట్టుబట్టలతో రైలులో భారత్‌కు చేరుకున్నారట . రైల్లో కూడా కొన్ని గొడవలు జరిగడంతో .. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ ప్రయాణం చేశారట.
పాకిస్థాన్ నుండి చాలా మంది ఇండియాకు కట్టుబట్టలతో రావడం వల్ల వారి చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో అనేక మంది స్థానికంగా కూలి పనులు చేయాల్సి వచ్చింది. కొందరు పంట పొలాల్లో పనిచేసే వారు. మరికొందరు కూరగాయలు అమ్ముకునే వారు. కొందరు తాపీ పని చేసేవారు. మా నాన్న అప్పట్లో వీధుల్లో తోపుడు బండ్లపై మొక్క జొన్నలు, ఇతర ధాన్యాలు అమ్మేవారట.
కొంతమంది పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు తమ బంగారాన్ని తెచ్చుకున్నారు. ఆ బంగారాన్ని ఇక్కడ అమ్ముకొని స్థలాలు కొనుక్కుని వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. కొందరు వ్యాపారాలను ప్రారంభించారు. కానీ మాలాంటి అనేక మంది జీవితాలు మాత్రం దుర్భరం అయ్యాయి.
అప్పట్లో పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులకు భారత ప్రభుత్వం స్థలాలను ఇచ్చింది. న్యూ ఇండస్ట్రియల్ టౌన్ (ఎన్ఐటీ) పేరిట అడవిలా ఉన్న ప్రాంతాన్ని బాగు చేసి వారికి ఇచ్చింది. అనేక మందికి ఒక్కొక్కరికి 2వేల చదరపు అడుగుల స్థలం ఉచితంగా లభించింది. కానీ మాలాంటి కొందరికి మాత్రం ప్రభుత్వం స్థలాన్ని ఉచితంగా ఇవ్వలేదు. మా నుంచి వాయిదాల పద్ధతిలో స్థలానికి డబ్బులు వసూలు చేశారు.
Advertisements
Advertisement
ఆ సమయంలో చాలా మంది వద్ద డబ్బులు ఉండేవి కావు. దీంతో అనేక మంది వస్తు మార్పిడి పద్ధతిలో వస్తువులను కొనేవారు. ఇప్పటికీ చాలా మంది అక్కడే నివసిస్తున్నారు. అందువల్ల ఒకరినొకరు సులభంగా గుర్తు పడతారు. కానీ నాకు మాత్రం పాకిస్థాన్‌లో ఉన్న మా పూర్వీకుల ఇళ్లను, స్థలాలను చూడాలని కోరికగా ఉంటుంది. అయితే అది తీరదు. ఎందుకంటే పాకిస్థాన్ వీసా తీసుకున్నా.. అక్కడ కేవలం కొన్ని ఎంపిక చేసిన స్థలాలను చూసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. బన్ను ప్రాంతానికి ప్రస్తుతం ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది.
Advertisements
ఇక ఇప్పుడు నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఫరీదాబాద్‌లో ఉన్న మా పూర్వీకుల ఇంటికి వెళ్తున్నా.. అక్కడ మా బామ్మ నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. కాలేజీ రోజుల్లో ప్రతి ఏడాది వేసవిలో పాకిస్థాన్‌లోని మా పూర్వీకుల ఇంటికి వెళ్లాలని అనుకున్నా.. అది తీరని కోరికని తెలిసి.. ఇప్పుడు మా ఖాళీ సమయాల్లో మా బామ్మ దగ్గరకు వెళ్లి గడుపుతున్నా.. ఆమె తయారు చేసి ఇచ్చే టీ నాకు ఎంతో బాగా నచ్చుతుంది. అదిగో ఆ ఫొటో అదే. 2015లో తీసింది. ఆమె నాకు టీ కలుపుతోంది. ఆమె వయస్సు 85 ఏళ్లు. అయినా ఆమె యాక్టివ్‌గా ఉంటుంది. నాకు స్నేహితురాలిలా, బామ్మలా ప్రేమను పంచుతుంది..!