Advertisement
పన్నెండేళ్ల వయసప్పుడు తన తండ్రికి బకాయి పడ్డ రైతుల దగ్గర అప్పు వసూలు చేసేవాడు..ఇప్పుడు దేశానికి అప్పుపడ్డ మొండి బకాయిలని వసూలు చేసే స్థాయికి ఎదిగాడు.. అతడే చల్లా శ్రీనివాసులు శెట్టి..తన చిన్ననాటి జ్ణాపకాలు తనకి ఇప్పటికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే ఆసక్తికరమైన విషయాన్ని శేర్ చేసుకున్నారు శ్రీనివాసులు,ఎండీ..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ఆంధ్రప్రదేశ్లోని పొట్లపాడుకి చెందిన శ్రీనివాసులు శెట్టి ఎస్బీఐ ముగ్గురు ఎండిలలో ఒకరు.. తండ్రికి ఊళ్లో పచారి కొట్టు ఉండేది..రైతులు ఆ కొట్టు నుండే వారికి కావలసిన సరుకులు కొనుక్కునేవాళ్లు..కొందరు అరువు తీసుకెళ్లేవాళ్లు..అలాంటి వాళ్ల నుండి డబ్బులు వసూలు చేసే డ్యూటి శ్రీనివాసులుది, అతడి సోదరుడుది..స్కూల్ సెలవు రోజు అన్నదమ్ములిద్దరూ ఒక్కొక్క ఇంటికి వెళ్లి రైతుల దగ్గర నుండి తన తండ్రికి రావలసిన అప్పుని వసూలు చేసేవారు. చిన్నప్పుడు రైతుల నుండి డబ్బులు వసూలు చేసారు,ఇప్పుడు 42 ఏళ్ల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన దాదాపు 19.6 బిలియన్ డాలర్ల మొండి బకాయిలను రికవరీ చేయడంలో బిజిగా ఉన్నారు.
Advertisement
తన తండ్రి కోసం అప్పు వసూలు చేసే టైంలో కీలక పాఠాలు నేర్చుకున్నానని వాటిల్లో చాలా ముఖ్యమైనది సమయం విలువ అని ..మనం ఎంత త్వరగా రికవరి చేస్తే అంత ముఖ్యం.. డబ్బులను త్వరగా రికవరి చేయాలంటే వన్ టైమ్ సెటిల్మెంట్స్ లోనే అది సాధ్యం..అందుకే శ్రీనివాసులు ఎక్కువగా వన్ టైమ్ సెటిల్మెంట్ లోన్స్ కే ప్రిపర్ చేస్తారట.. రెండో పాఠం ఫాలో అప్ చేస్కోవడం..మనం రుణాలు ఇచ్చిన తర్వాత వాటిని ఫాలో అప్ చేస్తుండడం కూడా ముఖ్యం అని..ముఖ్యంగా చిన్న మరియు మద్యతరగతి అకౌంట్స్ ని ఫాలో అప్ చేస్తుండాలి అంటూ చెప్పుకొచ్చారయన.
తెలివైన పరిష్కారం..
Advertisements
Advertisements
చిన్నప్పుడు రైతులనుండి డబ్బులను చాలా తెలివిగా వసూలు చేసేవారట..దానికోసం వాళ్లు ఫాలో అయిన రూల్ ఏంటంటే…. సరిగ్గా ఉదయం రైతులు పనులకు వెళ్లేటప్పుడు వాళ్ల ఇంటి బయట కాపలా కాసేవాళ్లట.. వీళ్లకు డబ్బులిచ్చాకే వాళ్లు వాళ్ల పనులకు వెళ్లాల్సి వచ్చేది.. దాంతో పని సులువయ్యేది. అప్పుడు నేర్చుకున్న పాఠాలే ఇప్పుడు బ్యాంక్ కు రుణపడి ఉన్న బకాయిలను రికవరి చేయడానికి ఉపయోగపడుతున్నాయి..