Advertisement
ఇప్పుడైనా అప్పుడైనా…ధనవంతులు తాము ఇతరుల్లో కంటే కాస్త తేడాగా మరింత అందంగా కనిపించాలనే అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే తాము ధరించే దుస్తువుల విషయంలో కేర్ తీసుకుంటారు. పురాతాన కాలంలో ప్యాషనబుల్ గా కనిపించడం కోసం….. ఏం చేశారు..? ఆ ట్రెండ్ ఎలా అర్థాంతరంగా ముగిసిందో ఇప్పుడు చూద్దాం!
ఆర్సెనిక్ డై:
అప్పట్లో ప్యారిస్ గ్రీన్ దుస్తులు ఫ్యాషన్ ఐకాన్ లు.! అవి గ్రీన్ కలర్‌లో కనిపించేందుకు ఆర్సెనిక్ డై వాడేవారు. ఆర్సెనిక్ డ్రై వాడిన ఆ దుస్తువులు నీటిలో తడిసినప్పుడు వాటి నుంచి ప్రమాదకరమైన రసాయనాలు వెలువడేవి. ఆ రసాయనాల కారణంగా కొందరు చనిపోయారు కూడా.! ఆ మరణాలకు కారణం ఆ డై అని కూడా చాలా మందికి తెలియదు.! ఆ విషయం తెలిశాక….ఆ ప్యారిస్ గ్రీన్ దుస్తువులను వాడడం మానేశారు….ఆ ఫ్యాషన్ కనుమరుగైంది!
పురుగుల రెక్కలతో దుస్తుల అలంకరణ:
Advertisements
అప్పట్లో కొందరు వెరైటీ ఫ్యాషన్ కోసం పురుగుల రెక్కలను దుస్తులపై అలంకరించేవారు. ఆ రెక్కలను సేకరించేందుకు కొందరు పనివాళ్లను సైతం పెట్టుకునేవారు.!
చనిపోయిన వారి వెంట్రుకలతో…..
అప్పట్లో కొందరు చనిపోయిన తమ కుటుంబీకుల వెంట్రుకలను సేకరించి వారి జ్ఞాపకంగా వాటిని అనేక వస్తువుల్లో వాడేవారు. క్రమంగా అది కూడా ఫ్యాషన్‌గా మారిపోయింది.
Advertisement
టోపీలకు పక్షుల రెక్కలు:
అప్పట్లో కొందరు తాము ధరించే టోపీలకు పక్షుల రెక్కలను అలంకరించేవారు. అందుకోసం అవసరమైతే పక్షులను కూడా చంపేవారు.
లో దుస్తులకు ద్వారాలు:
చైనాలో ఒకప్పుడు లోదుస్తులు జననావయవాలను పూర్తిగా కప్పి ఉంచేవి కావు. ముందు వెనుక భాగాల్లో ఓపెనింగ్ ఉండేది. ఎక్కువ సమయం పాటు లో దుస్తులను ధరించడం వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పి కొందరు వాటికి ఓపెన్ చేసి పెట్టుకునే వారు
సమతలమైన ఛాతి భాగం:
1920లలో కొందరు స్త్రీలు తమ ఛాతి భాగం సమతలంగా కనిపించేలా దుస్తులను ధరించేవారు. అప్పట్లో పురుషులు ఛాతి సమతలంగా ఉండే మహిళలను ఇష్ట పడేవారని చెప్పి కొందరు స్త్రీలు అలా ధరించారు. అందుకు ప్రత్యేక దుస్తులు ఉండేవి.
నలుపు రంగు దుస్తులు:
తమ కుటుంబీకులు చనిపోతే …. సంతాపంగా కొన్ని రోజుల పాటు అందరూ నలుపు రంగు దుస్తులను ధరించేవారు. ఆచారంగా వచ్చే ఈ బ్లాక్ కలర్ తర్వాత ఫ్యాషన్ గా మారిపోయింది!
Advertisements