Advertisement
ప్రస్తుత తరుణంలో చాలా మంది విద్యార్థులు బెస్ట్ యూనివర్సిటీల్లో చదివి చక్కని జాబ్ పొంది పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. ఆ దిశగా ఎంతో మంది ప్రయాణం చేస్తూ తమ కలలను సాకారం చేసుకున్నారు. అయితే కొందరు డబ్బు కన్నా దేశ సేవకే ప్రాధాన్యతను ఇస్తారు. అలాంటి వారు డబ్బు ఎక్కువగా వచ్చే జాబ్ కన్నా దేశానికి సేవ అందించే జాబ్‌ను చేసేందుకే ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయేది కూడా సరిగ్గా అలాంటి కోవకు చెందిన విద్యార్థి గురించే..
శుభం సిన్హా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ట్రిపుల్ ఈలో బీటెక్ పూర్తి చేశాడు. ఇండియన్ ఆర్మీ నిర్వహించిన యూపీఎస్‌సీ సీడీఎస్ 2 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ ఎస్ఎస్‌సీ టెక్నికల్ ఎగ్జామ్‌లో ఆలిండియా లెవల్‌లో 4వ ర్యాంక్ సాధించాడు. అంతేకాకుండా ఇండియన్ నావల్ అకాడమీలో ఎయిర్-19, ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఎయిర్-48 ను సాధించాడు.
Advertisement
అయితే ఇంతటి ఘనత సాధించిన ఎవరికైనా సరే నెలకు రూ.లక్షలు అందించే ప్రైవేటు జాబ్ వస్తుంది. కానీ ఇతను మాత్రం ఆర్మీలో చేరాలని అనుకున్నాడు. దేశానికి సేవ చేసేందుకు రేడీ అయ్యాడు. అందుకనే ఆయా పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఇక త్వరలోనే ఇండియన్ ఆర్మీలో ఇతను లెఫ్టినెంట్‌గా చేరి బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇండియన్ ఆర్మీలో స్పెషల్ ఫోర్సెస్‌లో పనిచేయాలన్నది తన కల అని శుభం సిన్హా తెలిపాడు. అందువల్ల ఎప్పటికైనా అందులో పనిచేస్తానని చెబుతున్నాడు. కాగా ఆర్మీలో ప్రస్తుతం అతను ఈసీఈ టెక్నికల్ వింగ్‌లో విధులు నిర్వర్తించనున్నాడు.
Advertisements
Advertisements
శుభం సిన్హాది బీహార్. అక్కడ స్కూల్ రోజుల్లోనే ఎన్‌సీసీలో అతను శిక్షణ పొందాడు. తరువాత ఇప్పుడు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా అతను తీసుకున్న నిర్ణయం పట్ల ఎంతోమంది అతన్ని అభినందిస్తున్నారు. ఇంజినీరింగ్‌ను అంతటి అత్యుత్తమ స్థాయిలో పూర్తి చేసి నెలకు రూ. లక్షల్లో జాబ్ వచ్చే అవకాశం ఉన్నా.. అతను ఆర్మీలో చేరడంపై అందరూ అతన్ని అభినందిస్తున్నారు. దేశానికి ఇలాంటి వారే కావాలని అంటున్నారు.