Advertisement
మద్రాస్ యూనివర్సిటీలో…ఓ స్టూడెంట్ చదువుతున్నప్పుడు 1905 లో తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో చదువుపట్ల ఓ విద్యార్థికి ఉన్న డెడికేషన్ ను చూపిస్తుంది. రాత్రి వేళల్లో చదవాలనుకున్న మద్రాస్ యూనివర్సిటీ విద్యార్థులంతా ఇలాగే చేసేవారంట! దీపపు వెలుగులో తమ పుస్తకాలతో రాత్రంతా గడిపేవారంట.! తమ పిలకను గోడకు కొట్టిన మేకుకు కట్టడం వెనుక కారణం తాము చదువుతున్న క్రమంలో నిద్రలోకి జారుకొని ముందుకు ఒరిగే ప్రయత్నం చేస్తే గోడకు కట్టిన ఆ పిలక అడ్డుకుంటుందన్న ఉద్దేశంతో ఇలా చేస్తారట.!
Advertisement
పరీక్షల సమయంలో చాలా మంది విద్యార్థులు చదివే సమయంలో నిద్ర రాకుండా ఉండేందుకు వివిధ రకాలు ట్రిక్స్ ఉపయోగిస్తారు.
- టీ- కాఫీ లను తాగడం
- చేతికి రబ్బర్ బ్యాండ్ ధరించి…నిద్ర వస్తున్న టైమ్ లో దానిని లాగి వదలడం.
- మధ్య మధ్యలో నడవడం
- తడిపిన బట్టను పక్కనే ఉంచుకొని నిద్రొచ్చినప్పుడల్లా ముఖం తుడుచుకోవడం.
- కణతల దగ్గర కాసేపు ఒత్తిపట్టుకోవడం.
Advertisements
అన్ని సౌకర్యాలు ఉండి కూడా చదవడానికి బద్దకించే ఈ జనరేషన్ పిల్లల్లు…ఈ ఫోటోను చూసి ..ఎటువంటి పరిస్థితుల్లో మన పూర్వీకులు చదువును కొనసాగించారనే విషయాన్ని అర్థం చేసుకోవొచ్చు.!
Advertisements