Advertisement
సుడిగాలి సుధీర్.. ఈ పేరు ఇప్పుడొక సెన్సేషన్ తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు, పక్కరాష్ట్రాల్లో కూడా సునీల్ పేరు మారుమోగిపోతుంది.. జబర్దస్త్ కామెడి స్కిట్లో టీం మెంబర్ నుండి లీడర్ గా ఎదిగి ఇప్పుడు షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ ,సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.. తనకోసం పచ్చబొట్టు పొడిపించుకునే అభిమానులు,తన లైఫ్ ని పాటగా రాసేవాళ్లు, తన జీవితాన్ని స్టేజిపై అభినయించి తమ అభిమానం చూపించేవారు..ఒక బుల్లితెర హీరోకి ఈ స్థాయిలో అభిమానాన్ని ఊహించి ఉండరు.అది సుధీర్ సాధించాడు..కానీ ఈ స్థాయి వరకు చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది..బుల్లితెర హీరో సుధీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..
- సుధీర్ అసలు పేరు సుధీర్ ఆనంద్ బయానా..కృష్ణా జిల్లా విజయవాడలో దేవ్ ఆనంద్ బయానా,నాగరాణి ఆనంద్ బయానా దంపతులకు 1987, మే 19న జన్మించాడు.. ఇంటికి పెద్దవాడు..తనకు ఒక చెల్లి,తమ్ముడు ఉన్నారు..తమ్ముడి పేరు రోహన్, చెల్లి పేరు శ్వేతా ఆనంద్.. రోహన్ భార్య రమ్య.. క్లుప్తంగా ఇది సుధీర్ కుటుంబం.
- ఇంటర్మీడియట్లో ఫస్ట్ టైం యాక్టింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు..స్టార్ మా వారు నిర్వహించిన స్టార్ హంట్ లో పాల్గిని ఫైనల్స్ కి చేరుకున్నాడు..ఫైనల్స్,ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఒకేసారి ఉండడంతో నటనే లక్ష్యంగా భావించి ఎగ్జామ్స్ అటెండ్ అవ్వకుండా స్టార్ హంట్ ఫైనల్స్ అటెండ్ అయ్యాడు.. సుధీరే విన్నర్ అవుతాడని అందరూ భావించారు కానీ, ఫైనల్స్ లో విజేత కాలేకపోయాడు..ఒకవైపు ఎగ్జామ్స్,మరోవైపు స్టార్ హంట్ లో ఫెయిల్ అయి విజయవాడ వెళ్లిపోయాడు..తర్వాత ఆరేళ్లకు ఇంటర్ గట్టెక్కాడు.
- కమెడియన్,యాక్టర్,యాంకర్,డ్యాన్సర్,షో స్టాపర్ సుధీర్ గురించి అందరికి తెలిసిన విషయాలు కానీ సుధీర్ మంచి మాంత్రికుడు..మెజిషియన్.. చిన్నప్పటి నుండి మేనమామ దగ్గర నేర్చుకున్న మ్యాజిక్ విద్యతో ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చాడు..తన కెరీర్ స్టార్ట్ అయిందే మెజిషియన్ గా .. లోకల్ టివిలో స్ట్రీట్ మ్యాజిక్,స్వీట్ మ్యాజిక్ అనే ప్రొగ్రామ్ చేసాడు..తర్వాత మాటివి వారు పెద్ద ఎత్తున మ్యాజిక్ ప్రొగ్రామ్ నిర్వహించగా దానికి హోస్ట్ గా మెజిషియన్గా వ్యవహరించాడు.
Advertisement
- సుధీర్ జీవితంలో జరిగిన అతిపెద్ద చేదు ఘటన..అతడి తండ్రికి యాక్సిడెంట్ జరగడం..ఇంటికి పెద్దకొడుకు కావడంతో కుటుంబ భారం తనపైనే పడింది..అప్పుడు అతడి మాయాజాల విద్యే అతన్ని కాపాడింది..ఏడాదిపాటు రోజుకు మూడు షోల చొప్పున చేసేవాడు..
- ఇక లాభం లేదనుకుని మ్యాజిక్ షో వదిలిపెట్టి నటుడిగా స్థిరపడాల్సిందే అనుకున్నాడు..కానీ అవకాశాల్లేవ్..తినడానికి తిండి లేదు..తాగడానికి నీళ్లు కూడా కష్టం అయిన రోజుల్లో సింక్ నీళ్లు తాగి బతికిన చేదురోజులున్నాయి సుధీర్ జీవితంలో..
Advertisements
- గెటప్ శీను పరిచయంతో జబర్దస్త్లో చోటు సాధించాడు.వేణు వండర్స్ టీం మెంబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, తర్వాత సుడిగాలి సుధీర్ అండ్ టీం గా ఎదిగి తన మార్క్ కామెడి పంచ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. సుధీర్ కి బ్రేక్ ఇచ్చిన షో జబర్దస్త్ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
- జబర్దస్త్ ,ఎక్స్ట్రా జబర్దస్త్, పోవేపోరా.. ఇలా చేతిలో ఎన్నో కార్యక్రమాలు.. మధ్యమధ్యలో సినిమాల్లో చిన్నచిన్న అవకాశాలు..ఇప్పుడు ఏకంగా హీరోగా ఎదిగాడు. జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది.
- సాఫ్ట్ వేర్ సుధీర్, 3మంకీస్ సుధీర్ హీరోగా నటించిన సినిమాలు..మరో ప్రాజెక్ట్ చేతిలోకి రావడంతో జబర్దస్త్ కి దూరం కానున్నాడు అనే వార్తలు వస్తున్నాయి..దాంతో ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్నారు..
Advertisements
- బుల్లితెరపై పండగలకు ,పబ్బాలకు ఏ స్పెషల్ ప్రోగ్రామ్ ఉన్నా సుధీర్ ఉండాల్సిందే అన్నట్టుగా గుర్తింపు పొందాడు..తనపై అభిమానులకు ఎంత అభిమానం అంటే ప్రోగ్రాంలో భాగంగా తనపై పంచ్ లు వేసిన భరించలేనంతగా..
- 2018లో మోస్ట్ డిజైరబుల్ మేన్ ఎంపికలో స్థానం దక్కించుకున్నాడు..వీటన్నింటివెనుక సుధీర్ కష్టం ఉంది.. ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి తన ప్రాణం పెడతాను అని ఒక షోలో సుధీర్ అన్న మాటలు తనకు కళ అంటే ఎంత ఇష్టమో సూచిస్తాయి..