Advertisement
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ కుమార్తె సుహానా ఖాన్‌ను చాలా మంది ద్వేషిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అగ్ర నటుడి కుమార్తె కావడం వల్ల సుహానా ఖాన్‌కు సహజంగానే విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే ఆమె స్కిన్ కలర్‌పై కూడా కొందరు ఎప్పటి నుంచో కామెంట్లు చేస్తున్నారు. ఆమె వార్తల్లో నిలిచిన ప్రతి సారీ ఆమెను విమర్శిస్తూనే ఉన్నారు. కొందరు కాలీ (నలుపు) అని అంటే.. కొందరు అగ్లీ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే వాటన్నింటికీ సుహానా ఖాన్ తనదైన శైలిలో తాజాగా బదులిచ్చింది.
తనకు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి అనేక మంది తనపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని సుహానా ఖాన్ పేర్కొంది. తన పట్ల ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారని, తనను విమర్శిస్తున్నారని, అది కేవలం తనపైనే కాదని, తనలాంటి కలర్‌లో ఉన్న అనేక మందిపై చేస్తున్న విమర్శలని ఆమె వ్యాఖ్యానించింది. ఇది ఇప్పటికైనా ఆపేయాలని అన్నది. సమాజంలో కొందరు చేసే అలాంటి వ్యాఖ్యల వల్ల చర్మం రంగు నల్లగా ఉన్నవారిలో ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ నెలకొంటుందని అది మంచిది కాదని పేర్కొంది.
మనమందరం ఇండియన్స్ అని, అందువల్ల మనం సహజంగానే నలుపు రంగులో ఉంటామని, అయితే నలుపు రంగులో ఉన్నవారికి దూరంగా ఉండడం అంటే మీ సొంత మనుషులను మీరు ద్వేషిస్తున్నట్లేనని, మీలో అభద్రతా భావం ఉందని.. సుహానాఖాన్ ఇన్‌స్టాగ్రాం వేదికగా దీటుగా రిప్లయి ఇచ్చింది. ఈ మేరకు ఆమె తాజగా పోస్టులు పెట్టింది. #endcolourism హ్యాష్ ట్యాగ్ పేరిట వాటిని పోస్ట్ చేసింది.
Advertisements
View this post on InstagramAdvertisement
Advertisements
కాగా ప్రస్తుతం సుహానాఖాన్ న్యూయార్క్ ఫిలిం స్కూల్‌లో చదువుతోంది. కరోనా నేపథ్యంలో గత కొంత కాలంగా ఆమె ముంబైలో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. సుహానాఖాన్ ఇప్పటి వరకు సినిమాల్లో నటించలేదు. కానీ ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఆ షార్ట్ ఫిలిం గతేడాది విడుదలైంది.