Advertisement
సుకుమార్ లెక్కల మాస్టార్….. మ్యాథ్స్ క్లాసులు చెబుతున్నా ఆయన మైండ్ ఎప్పుడూ మైండ్ బ్లాక్ అయ్యే సినిమాను డైరెక్ట్ చేయాలనే ఆలోచననే చేస్తుండేది. అందుకే లెక్చరర్ గా ఉన్నప్పుడే ఓ కథ రెడీ చేసుకున్నాడు. తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తో ఆ కథను రాసుకున్నాడు.
అవకాశమెలా?
వివి వినాయక్ తమ్ముడు సుకుమార్ మంచి ఫ్రెండ్స్…. ఆ పరిచయంతో దిల్ సినిమాకు సుకుమార్ వివి వినాయక్ దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. దిల్ సినిమా షూటింగ్ లో వినాయక్ కు , దిల్ రాజు కు బాగా కనెక్ట్ అయిపోయాడు సుకుమార్ . ఈ సినిమా హిట్ అయితే నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అన్నాడు దిల్ రాజ్. 2003 లో దిల్ సినిమా రిలీజై సూపర్ హిట్టయింది . అనట్టే సుకుమార్ కు డైరెక్టర్ గా ఛాన్స్ లభించింది.
Advertisements
ఆర్య హీరోగా మొదట ప్రభాస్ తర్వాత నితిన్…. చివరకు బన్నీ!
హీరో కోసం వేట మొదలు పెట్టారు. ప్రభాస్ నో చెప్పాడు , నితిన్ కథ నచ్చలేదు అన్నాడు. రవి తేజ ఫుల్ బిజీ డేట్స్ లేవు . ఒకరోజు దిల్ రాజు ప్రభాస్ కోసం దిల్ సినిమాను ప్రత్యేకంగా చూపించాడు. ఆ సినిమా చూడడానికి ప్రభాస్ తో పాటు ఆయన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఆ బ్యాచ్ లో ఒక కుర్రాడు బావా బావా అంటూ తెగ అల్లరి చేస్తున్నాడు . అతన్ని చూడగానే సుకుమార్ కి తన కథలోని హీరో క్యారెక్టర్ కు సూట్ అవుతాడనిపించాడు…. ఆరా తీస్తే అతను అల్లు అరవింద్ కొడుకని గంగోత్రి సినిమా హీరో అని తెలిసింది.
Advertisement
బన్నీ తో ముచ్చట:
బన్నీ వద్దకు వెళ్లిన సుకుమార్…… నా దగ్గర ఒక కథ ఉంది , వినండి నచ్చితే మీరే హీరోగా చేద్దురు అంటూ కథను వివరించాడు….బన్నీ కథకు బాగా కనెక్ట్ అయ్యాడు….వెంటనే మా నాన్నకు చెప్పండి అన్నాడు. కథ విన్న అల్లు అరవింద్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చిరంజీవికి కూడా కథ బాగా నచ్చింది. కథ వినే 100 డేస్ ఫంక్షన్ కి ప్లాన్ చేసుకోండి అన్నాడట! 4 కోట్ల బడ్జెట్ తో 120 రోజుల్లో షూటింగ్ పూర్తైపోయింది. టైటిల్ నచికేత అనుకున్నారు.మరీ గ్రాంథికంగా ఉందని ఆర్య గా మార్చేశారు.
రిలీజ్ & రికార్డ్స్ :
2004 మే 2 న ఈ సినిమా రిలీజైంది. మండుటెండలో చల్లనైన ప్రేమని ఫీల్ అయ్యారు ఆడియన్స్. కొత్త ప్రేమకథ, బన్ని స్టైలిష్ యాక్టింగ్ , సుకుమార్ ఎక్సలెంట్ టేకింగ్, అద్భుతమైన సాంగ్స్…. ఈ సినిమాని ఎక్కడో నిలబెట్టాయి! ఫీల్ మై లవ్ , అ అంటే అమలాపురం సాంగ్స్ అయితే రింగ్ టోన్స్ గా మోతమోగాయి!
కలెక్షన్లు :
4 కోట్లతో తెరకెక్కిన ఆర్య 16 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. హైదరాబాద్ సుదర్శన్ లో 1 కోటి 34 లక్షల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది . మొత్తం మీద 90 సెంటర్స్ లో 50 రోజులు …. 56 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది.
అవార్డ్స్ :
అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ గా స్పెషల్ జ్యూరీ నంది అవార్డ్
బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్ కి ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్
స్క్రీన్ ప్లే రైటర్ కి మరియు ఫైట్ మాస్టర్స్ కి నంది అవార్డ్స్ లభించాయి .
Advertisements
ఈ సినిమాతో ఓ లెక్కల మాస్టార్ కి తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ వచ్చి పడింది . నిర్మాతలు చెక్ బుక్ లతో సుకుమార్ ఇంటికొచ్చి మాకో సినిమా చేసి పెట్టంటూ నిల్చున్నారు!