Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

క‌రాటే లో బ్లాక్ బెల్ట్ అయిన‌….ఆ ఇద్ద‌రు హీరోలు క‌లిసి చేసిన 9 సినిమాలు….ప్ర‌తి సినిమా హిట్టే!

Advertisement

NTR & కృష్ణ‌ ,  కృష్ణ‌ &శోభన్ బాబు ,  NTR & ANR …. అప్ప‌ట్లో వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చే సినిమాల‌కు మ‌స్త్ క్రేజ్ ఉండేది! వాళ్ల త‌ర్వాత మళ్ళీ  అలాంటి  క్రేజ్ ని  సంపాదించుకున్న కాంబినేషన్  సుమన్ , బాను చందర్.! ఇద్దరూ  యాక్షన్  హీరోస్ , ఇద్ద‌రికీ క‌రాటే లో బ్లాక్ బెల్ట్…..దీంతో వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చే సినిమాల‌పై హై ఎక్స్ పెక్టేష‌న్స్ ఉండేవి….దానికి త‌గ్గ‌ట్టే వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన 9 సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఏమాత్రం డిస్సపాయింట్ కు గురిచేయ‌లేదు!

సుమ‌న్, భాను చంద‌ర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన 9  సినిమాలు 

1. ఇద్దరు కిలాడీలు 

ఫస్ట్ టైం  1982 లో  ఇద్దరు  కిలాడీలు  మూవీలో  సుమ‌న్, భాను చంద‌ర్ లు హీరోలుగా  చేశారు .  తెలుగులో  సుమన్ కి  ఇదే ఫస్ట్ మూవీ  కానీ  తమిళ్ లో  ఆల్రెడీ  పరిచయం  ఉన్న హీరో .  తెలుగులో  అప్పటికే  భాను చందర్ కి  క్రేజ్ ఉండేది .  పైగా  మార్ష‌ల్ ఆర్ట్స్  నేపథ్యంలో  చేసిన  ఫస్ట్ తెలుగు  మూవీ  కూడా  ఇదే.!

Advertisements

2. తరంగిని 

వీరి కాంబినేష‌న్లో అదే  సంవత్సరం  1982 లో  రిలీజ్  అయిన మ‌రో మూవీ… తరంగిని.! ఈ సినిమాతో  వీరిది హిట్  పెయిర్  అనే ముద్ర పడిపోయింది .

3. గడుసు పిండం 

1984 లో  రిలీజ్  అయిన  ఈ సినిమా  పెద్దగా ఆడకపోయిన  నిర్మాతకు  లాభాలు  అయితే  తెచ్చిపెట్టింది .  వీరి  కాంబినేషన్ పై  ఇంకాస్త  క్రేజ్ పెంచింది.

4. మెరుపు దాడి 

అదే  సంవత్సరం  1984 లోనే  రిలీజ్  అయిన మెరుపు  దాడి  కమర్షియల్ గా  హిట్ మూవీ .

5. కుర్ర చేష్టలు 

Advertisement

1984 లోనే  రిలీజ్  అయిన  ఈ మూవీ  కూడా యావరేజ్  అయినా  వీరి కాంబినేషన్ పై  మ‌రింత‌గా అంచనాలు పెంచింది!   ఇలా  1984 వ  సంవత్సరం సుమన్,  భాను  చందర్ ల పేర్లు మారుమోగి పోయాయి.!

6. మొండి జగమొండి 

1985 లో  రిలీజ్  అయిన  సుమన్ , భాను చందర్ ల ఆరో  ముల్టిస్టారర్  అయిన  ఈ మూవీపై  బారి అంచనాలే  ఏర్పడ్డాయి .  మంచి  కథ  బలంతో  మొండి జగమొండి  సినిమా సక్సెస్  సాధించింది .

7. సమాజంలో స్త్రీ 
1986 లో  రిలీజ్  అయిన  సమాజంలో స్త్రీ  సినిమా, యావరేజ్ గా  ఆడినా  మంచి  చిత్రంగా  పేరు తెచ్చుకుంది .

8. డాకు 

హై  ఎక్స్పెటషన్స్ తో  1987 లో  రిలీజ్  అయిన  డాకు  సినిమా  కమర్షియల్ గా  హిట్ అయ్యింది .  ఈ సినిమా  తర్వాత  మళ్ళీ 6 ఏళ్ల‌కు వీరి కాంబినేషన్ లో  ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు .

9. నక్షత్ర పోరాటం 

ఆరు  సంవత్సరాల  గ్యాప్  తర్వాత  1993 లో  వీరి కాంబోలో  వచ్చిన  9 వ సినిమా నక్షత్రం  పోరాటం .  పూర్తిస్థాయి  యాక్షన్  మూవీ గా రూపొంది  యాక్షన్  మూవీ  లవర్స్ ని  అలరించింది .

Advertisements

దీని  తర్వాత  1995 లో  మళ్ళీ  వీరి  కాంబోలో  ఇంకో మూవీ  అనౌన్స్  అయింది .  కానీ  ఎందుకో ఆగిపోయింది .  మళ్ళీ  నక్షత్ర  పోరాటం  సినిమాకి సీక్వెల్  కూడా  ట్రై  చేసారు,  అది  కూడా  కాలేదు.