• Home
  • About
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

  • News
  • Story Pic
  • Life Story
  • LT-Exclusive

బిగ్ బాస్ సండే ఎపిసోడ్ వివ‌రంగా! ఫస్ట్ ఎలిమినేష‌న్ సూర్య‌కిర‌ణ్., కొత్త ఎంట్రీ కుమార్ సాయి

September 13, 2020 by Admin

Advertisement

అలా వైకుంఠపురంలో చిత్రంలోని రాములో రాముల సాంగ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సండే ఈజ్ ఫండే అంటూ మన టివి ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళారు.ఇంట్లోకి వెళ్ళగానే టైమ్ వేస్ట్ చేయని నాగార్జున ఇంట్లో సభ్యులందరినీ గార్డెన్ లోకి వెల్లవలసిందిగా ఆదేశించారు.ఇక గార్డెన్ లోకి చేరిన ఇంటి సభ్యులను బాయ్స్, గర్ల్స్ సపరేట్ గా కూర్చోవాలని చెప్పారు.దానితో ఇంటి సభ్యులంతా నాగార్జున చెప్పినట్టు సపరేట్ గా కూర్చున్నారు.ఇక నాగార్జున అటు బాయ్స్ నుండి ఒకరిని,ఇటు గర్ల్స్ నుండి ఒకరిని వచ్చి డ్యాన్స్ వేయమన్నారు.వాళ్ళు వేసిన డాన్స్ కు అమ్మ రాజశేఖర్ ను మార్కులు ఇవ్వవలసిందిగా నాగార్జున ఆదేశించారు.

ఈ ప్రక్రియలో మొదట మెహబూబ్ దిల్ సే, మోనాల్ డ్యాన్స్ వేయడానికి వచ్చారు.వారికోసం బిగ్ బాస్ రంగస్థలం లోని జిగేల్ రాణి పాట ను ప్లే చేశారు.ఇద్దరు డ్యాన్స్ పూర్తయ్యాక అమ్మ రాజశేఖర్ మోనాల్ కి 6 మార్కులు,మెహబూబ్ కు 9 మార్కులుఇచ్చారు.

ఆతరువాత డ్యాన్స్ వేయడం కోసం సొహైల్ కళ్యాణి ముందుకు వచ్చారు.వారికోసం బిగ్ బాస్ రంగ రంగ చల్ మోహన్ రంగ పాటను వేశారు.ఇక వీరి డ్యాన్స్ కి అమ్మ రాజశేఖర్ కల్యాణికి 7, సొహైల్ కి 6 ఇవ్వగా, నాగార్జున కల్యాణికి 9, సొహైల్ కి 7 ఇచ్చారు.

ఇక ఆ తరువాత హారిక, నోయల్ నీతోనే డ్యాన్స్ ఫర్ లైఫ్ సాంగ్ కు డ్యాన్స్ వేసి దుమ్ము దులిపారు. వీరిరువురికీ నాగార్జున అమ్మ రాజశేఖర్ మాస్టర్ 8 ఇచ్చారు.

Advertisements

తర్వాత అభిజిత్,దేవి సీటిమార్ సాంగ్ కు డ్యాన్స్ వేశారు. వీరు వేసిన డ్యాన్స్ కు అమ్మ రాజశేఖర్ దేవికి 8,అభిజిత్ కి 6 మార్కులు ఇచ్చారు.ఇక నాగార్జున అయితే దేవికి 8,అభిజిత్ కి 7 ఇచ్చారు.

అఖిల్,దివి మైండ్ బ్లాక్ సాంగ్ ప్లే చేశారు.దివి ఈ పాటకు డాన్స్ ఇరగదిస్తే ప్యాంట్ టైట్ గా ఉందని ఇక అఖిల్ సరిగ్గా డ్యాన్స్ వేయలేదు.దానితో రాజశేఖర్ అఖిల్ కు 5,దివికి 8 మార్కస్ ఇచ్చారు.ఇక నాగార్జున అయితే అఖిల్ కి 7,దివికి 8 ఇచ్చారు.

తర్వాత నెక్లెస్ గొలుసు సాంగ్ కు లాస్య,సూర్య కిరణ్ డ్యాన్స్ వేశారు.డ్యాన్స్ వేసే టైంలో సూర్య కిరణ్ షర్ట్ ఇప్పేశాడు.ఇక ఎక్కడ బనియన్ కూడా విప్పేస్తాడేమో అని నాగార్జున సాంగ్ ను అపేయమన్నారు.ఇక సూర్య కిరణ్ కి 8,లాస్య కు7 మార్కులు  ఇచ్చారు.

ఇక సరదాగా అమ్మ రాజశేఖర్ తో గంగవ్వ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ కి డ్యాన్స్ వేశారు.ఇక గంగవ్వ డ్యాన్స్ కు నాగార్జున 10 మార్కులు ఇచ్చారు.

ఇక బాయ్స్ వర్సెస్ గర్ల్ డ్యాన్స్ కాంపిటీషన్ లో బాయ్స్ 88 పాయింట్స్ సాధించగా,గర్ల్స్ 91 పాయింట్స్ సాధించి విజయం సాధించారు.ఆతరువాత ఎలిమినేషన్ నుండి ఒకళ్ళను సేవ్ చేయడానికి నాగార్జున హే అఖిల్ అనే పాట ప్లే చేసి అఖిల్ ను సేవ్ చేశారు.

ఇంకొకర్ని ఎలిమినేషన్ నుండి సేవ్ చేయడానికి నాగార్జున ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు. ఇక ఆ టాస్క్ మెటీరియల్ ను స్టోర్ రూం నుండి తీసుకురావాల్సిందిగా క్యాప్టెన్ లాస్యను నాగార్జున ఆదేశించారు.ఆ టాస్క్ ప్రకారం ఒకరు చీటి తీసి తమకి వచ్చిన రైమ్ ను గీసి తన పార్టనర్ కు అర్థమయ్యేలా చెప్పాలి.ఈ టాస్క్ చేయడం కోసం ముందుగా లాస్య,మెహబూబ్ ముందుకు వచ్చారు.

Advertisement

ఇక చీటి తీసిన మెహబూబ్ కొద్దిగా తన ముందున్న పేపర్ మీద బొమ్మ గీయగానే లాస్య చిట్టి చిలకమ్మా రైమ్ అని గుర్తుపట్టింది.ఆతరువాత ఈ టాస్క్ ను ఆడడం కోసం అమ్మ రాజశేఖర్,దివి ముందుకొచ్చారు.జాక్ అండ్ జిల్ వెంట్ ఆఫ్ హిల్ అని వచ్చిన రైమ్ ను దివితో చెప్పించడం కోసం రాజశేఖర్ ఏదో ఏదో గీశాడు.కాని దివి దీన్ని గెస్ చేయలేకపోయింది.

సొహైల్, అరియానాకు బాబా బ్లాక్ షిప్ రైమ్ వచ్చింది. దాన్ని అరియానాకు అర్థమయ్యేలా చెప్పడం కోసం సొహైల్ చాలా కష్టపడ్డాడు.కాని దీన్ని అరియానా గెస్ చేయలేకపోయింది.

ఇక బావ బావ పన్నీరు అనే రైమ్ సూర్య కిరణ్,దేవిలకు వచ్చింది.దాన్ని ఈ జంట కూడా గెస్ చేయలేకపోయారు.అఖిల్ గీసిన బొమ్మ ద్వారా కరాటే కళ్యాణి అది డింగ్ డాంగ్ బెల్ అని చెప్పింది.ఇక నాగార్జున కోరిక మేర ఆ రైమ్ ను కళ్యాణి హరికథల పాడింది.

ఇక అభిజిత్,హారిక కు జానీ జానీ ఎస్ పప్ప రైమ్ వచ్చింది.ఈ ప్రాసెస్ లో వాళ్లకు క్లూస్ ఇవ్వడానికి లాస్య ట్రై చేస్తే బి సైలెంట్ అని నాగార్జున లాస్యను వార్న్ చేశారు.ఇక ఈ జంట కూడా ఈ టాస్క్ ను పూర్తి చేయలేకపోయింది.మోనాల్ కు తెలుగు రాకపోవడంతో సుజాత కు వచ్చిన రైమ్ ను గెస్ చేయడానికి నోయల్ రంగంలోకి దిగాడు .గెస్ చేశాడు.

ఇక గంగవ్వ ను అందరి ఇంటి సభ్యులలో రైమ్ ను గెస్ చేయమని చెప్పకుండా నాగార్జున ఆమె చేత జోల పాట పాడించాడు.ఆతరువాత మెహబూబ్ ను ఎలిమినేషన్ నుండి నాగార్జున సేవ్ చేశారు.ఇక నోయల్ మమ్మల్ని ఎలిమినేషన్ పేరుతో విడదీయవద్దని ర్యాప్ సాంగ్ పాడాడు.దానికి నాగార్జున బిగ్ బాస్ సీతయ్య ఎవరి మాట వినడు అంటూ మోనాల్ ఎలిమినేట్ అయ్యే వ్యక్తికి నువ్వు నీళ్ళు ఇవ్వడానికి గ్లాస్ ఆఫ్ వాటర్ తెచ్చుకో అని అన్నాడు.అదే టైంలో నాగార్జున నీరుకి, కన్నీరుకి మోనాల్ కు బాగా కనెక్షన్ ఉందని అన్నారు.

ఇక మోనాల్ నువ్వు ఎవరికీ వాటర్ ఇవ్వాలని అనుకుంటున్నావు అని నాగార్జున అడిగారు.ప్రశ్న అర్థం కానీ మోనాల్ సూర్య కిరణ్ అని సమాధానం చెప్పింది.వెంటనే నాగార్జున మీరు ఎలిమినేట్ అయ్యారని సూర్య కిరణ్ కి చెప్పి ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచారు.ఇక స్టేజి మీద ఉన్న సూర్య కిరణ్ ఇంటి సభ్యులకు తన ముందు ఉంచిన బోర్డ్ లోని యానిమల్స్ ను కేటాయించారు.

మోనాల్ నెమలి

గంగవ్వ చీమ

దేవి ముసలి

సొహైల్ ఎలుక

అభిజిత్ పిల్లి

దివి తాబేలు

కళ్యాణి కోతి

మెహబూబ్ గద్ద

హారిక పాము అంటూ విషం చిమ్మడం మానుకో అన్నారు

సుజాత కుక్క

నోయల్ నక్క

లాస్య గాడిద

అరియానా గుడ్లగూబ

అఖిల్ దున్నపోతు

అభిజిత్ పిల్లి

రాజశేఖర్ సింహం

Advertisements

అని చెప్పారు.ఆతరువాత ఒకరోజు పని చేయకుండా ఉండేలా బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ బాంబ్ ను యాంకర్ దేవిపై సూర్య కిరణ్ వేశారు.ఇక ఈరోజు కుమార్ సాయి బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఎంట్రీ అయిన కుమార్ సాయి కిచెన్ లో వెళ్లి పడుకున్నాడు.మరి అతన్ని చూసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఏం చేస్తారు అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Filed Under: Bigboss updates

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యాని … [Read More...]

TV9 ను దాటిన NTV!

దాదాపు 17 నెల‌ల త‌ర్వాత బార్క్ విడుద‌ల … [Read More...]

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

జాతీయ భాష ఏంటీ...? హిందీ... జాతీయ పక్షి … [Read More...]

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత … [Read More...]

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

క్రికెట్ లో మూడ నమ్మకాల గురించి ఎంత … [Read More...]

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల … [Read More...]

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

మన ఇండియాలో చాలా స్టార్ట్ అప్ లు ఎందుకు … [Read More...]

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ … [Read More...]

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

మీకు ఎంత బంగారం ఉంది అంటే పది తులాలు, 20 … [Read More...]

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

హైదరాబాద్ చూడాలని చాలా మందికి కోరిక. మన … [Read More...]

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లిని ఘనంగా … [Read More...]

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

జాబ్స్ రావడం అనేది ఒక సవాల్ అనే విషయం … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలా మందికి ఒక … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భార్యల కష్టాలు ఏంటీ…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వినడానికి, … [Read More...]

అసలు నూట పదహార్లు అనేది ఎలా వచ్చింది…?

కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా … [Read More...]

అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?

ఈ మధ్య కాలంలో వైఫై కాలింగ్ అనే మాట … [Read More...]

కాప్చా అంటే ఏంటీ…? అసలు ఎందుకు తీసుకొచ్చారు…?

సైబర్ దాడుల విషయంలో ఇప్పుడు నిపుణులు … [Read More...]

అమ్మాయిలు ఎక్కువగా మద్యం తాగుతున్నారా…? యువత మద్యాన్ని వదిలేస్తుందా…?

మద్యానికి బానిస కావడం అంటే మన జీవితాన్ని … [Read More...]

బయటకు వెళ్తే వితంతువు ఎదురు వస్తే ఎందుకు మంచిది కాదు…?

భారతదేశంలో ఉండే కొన్ని సాంప్రదాయాలు … [Read More...]

బొట్టు పెట్టుకోవడం ఎందుకు మంచిది…? బొట్టుకి రక్త ప్రసరణకు ఉన్న సంబంధం ఏంటీ…?

హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఎవరు … [Read More...]

Search

Advertisements

Latest Posts

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

TV9 ను దాటిన NTV!

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

Copyright © 2023 · Logical Telugu - Designed and Managed by Rishi Bharadwaj