Advertisement
శనివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణిని ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున వేదికపైకి ఆహ్వానించారు. నాగార్జునతో కరాటే కళ్యాణి మాట్లాడుతూ అక్కడ వాళ్లు గేమ్ ఆడుతున్నారు. నేనూ ఆడుతున్నాను. కానీ, నేను ఫిట్ కాదని నాకే అర్థమైపోయింది’’ అని అన్నారు.
ఇక మొదటి వారమే వచ్చేస్తానని ఇంట్లో ముందుగానే చెప్పేశాను..కాని రెండో వారం వరకు ఉండటం ఆ భగవంతుడి దయ అనుకుంటానని కళ్యాణి అన్నారు.ఇక కళ్యాణీకి నాగార్జున ఓ టాస్క్ ఇచ్చారు అందులో ఇంటి సభ్యులలోని టాప్-5, బాటమ్-5 బ్లాక్‌లో ఉంచవల్సిండిగా నాగార్జున సూచించారు.
దీనితో కల్యాణి బాటమ్-5లో సొహైల్ (5), సుజాత (4), అరియానా గ్లోరీ (3), కుమార్ సాయి (2), గంగవ్వ (1) ను ఎంపిక చేశారు. ఇక టాప్ – 5లో దేత్తడి హారిక (1), ‘అమ్మ’ రాజశేఖర్ (2), మోనాల్ (3), దివి (4), అభిజిత్ (5) ను ఎంపిక చేశారు.
ఇక మూడో వారం నామినేషన్స్‌లోకి డైరెక్ట్ గా పంపే బిగ్ బాంబ్ ను కళ్యాణి , దేవి పై వేసింది.దీనితో మూడో వారంలో మొదట నామినేషన్స్‌లోకి దేవి చేరింది.రెండోవారం మిగిలిన ఏడుగురు ఇంటి సభ్యులలో సేఫ్ జోన్‌లోకి వెళ్లేది ఎవరో తేల్చడానికి బెలూన్ ఆటను పెట్టారు నాగార్జున.ఇక ఈ బెలూన్లపై నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్ ల పేరులు ఉన్నాయి.ఆ బెలూన్లను నోయల్ ఆయా కంటెస్టెంట్లకు అందజేశారు. వాటిని పగలగొట్టాలని..వాటిలో గ్రీన్ రేఫర్స్ వస్తే సేఫ్ అని, రెడ్ రేఫర్స్ వస్తే డేంజర్ జోన్ అని నాగార్జున అన్నారు. ఈ ఆటలో అభిజిత్, కుమార్ సాయి ఎలిమినేషన్ నుంచి బయటపడగా.
ఆతరువాత ఇంటి సభ్యులను సేవ్ చేయడానికి నాగార్జున హౌస్ మేట్స్‌తో డాగ్ అండ్ బోన్ గేమ్ ఆడించారు. ఇక ఈ గేమ్ లో ఇద్దరు ఇంటి సభ్యులు బోన్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయాలి.పాట ఆగినవెంటనే బోన్‌ను తీసుకోవాలి. ఇక బోన్ ముందుగా తీసుకునేవారు విన్నర్ అవుతారు. ఓడిపోయిన వాళ్లకు పనిష్మెంట్ ఉంటుంది అని అన్నారు.దానికి ఏం పనిష్మెంట్ వస్తుందో అని అందరూ తమ శక్తి మేర ఆడి నవ్వులు పువ్వులు పూయించారు.
Advertisements
Advertisement
ఆతరువాత ఎలిమినేషన్ నుంచి రాజశేఖర్ ఈజ్ సేఫ్’’ అని నాగార్జున అనౌన్స్ చేశారు.ఇక డాగ్ అండ్ బోన్ గేమ్ పూర్తయ్యాక ఎలిమినేషన్‌లో ఉన్న నలుగురిలో మొదట సొహైల్ తరవాత నోయల్ ను సేవ్ చేశారు.దానితో ఎలిమినేషన్ లో హారిక, మోనాల్ మిగిలారు.ఇక వీళ్లిద్దరికి ఒక్కొక్కరికీ ఒక్కో గాజు బీకర్ ఇచ్చి వారి ముందు బ్లూ, గ్రీన్ కలర్ నీళ్లు పెట్టారు.ఇందులో
హారిక బ్లూ కలర్ వాటర్‌ను ఎంపిక చేసుకోవడంతో గ్రీన్ కలర్ వాటర్ మోనాల్ వెళ్లింది. వీరిద్దిరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను హౌస్ లో ఈవారం నామినేట్ అవ్వని కంటెస్టెంట్లకు నాగార్జున అప్పగించారు.దీనితో ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా వెళ్లి బీకర్ ముందు ఉన్న హౌస్ మెట్ ను ఎలిమినేట్ చేస్తున్నట్టు.దీనికి గల కారణం చెప్పారు.దీనితో ఆ టాస్క్ ముగిసే సమయానికి దేత్తడి హారిక బీకర్‌లో నీళ్లు ఎక్కువగా ఉండటంతో ఆమెను ఎలిమినేట్ చేస్తున్నట్టు నాగార్జున ప్రకటించారు.ఈ ప్రకటన విన్న వెంటనే మోనాల్, రాజశేఖర్ కన్నీటిపర్యంతమయ్యారు.
Advertisements
ఇక వెళ్ళేముందు హారిక.. తన దేత్తడి సాంగ్ పాడడం మొదలుపెట్టింది. అందరూ ఆమెతో కలిసి కోరస్ పాడారు. ఇంతలో నాగార్జున హారికను వెనక్కి రమ్మని పిలిచారు.దానితో అభిజిత్, నోయల్.. హారికను తమ చేతులపై ఎత్తుకుని వెనక్కి తీసుకొచ్చారు. హారిక సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చింది. సెల్ఫ్ నామినేషన్ ఎంత పెద్ద తప్పో చెప్పడానికి ఇలా చేశామని ఇది సెల్ఫ్ నామినేషన్ చేసుకునేవారికి ఒక వార్నింగ్ అని నాగార్జున ఎపిసోడ్ ను ముగించారు.