Advertisement
ఐపిఎల్ లో ఆడాలి అనేది ఈ తరం క్రికెటర్ల కల… ఐపిఎల్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ తమలో ఉన్న ప్రతిభను చూపిస్తూ… అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఐపిఎల్ లో ఒక్క మ్యాచ్ లో స్టార్ గా ఆడితే ఇక ఆ తర్వాత కెరీర్ మీద భారీ అంచనాలు ఉంటాయి. ఇక ప్రాంతీయ అభిమానం కూడా ఐపిఎల్ జట్లు చూపిస్తూ ఉంటాయి. కాని మన హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఇది చాలా భిన్నంగా ఉంది.
హైదరాబాద్ జట్టులో ఒక్కరు అంటే ఒక్కరు కూడా లోకల్ ప్లేయర్ లేరు. మన ఆంధ్రా ఆటగాళ్ళ మీద ఇతర జట్లు శ్రద్ధ చూపించాయి గాని హైదరాబాద్ టీం మాత్రం చూపించలేదు. చెన్నై టీం… తమిళనాడుకి చెందిన సాయి కిశోర్, జగదీశన్, హరి నిశాంత్ ని కొనుగోలు చేసింది. ఆర్‌సీబీ తమ రాష్ట్ర ఆటగాళ్ళు పడిక్కల్, పవన్ దేశ్‌పాండే కు అవకాశాలు ఇచ్చింది. పంజాబ్ టీం అయితే నలుగురు ఆటగాళ్లను తమ రాష్ట్రం నుంచి తీసుకుంది.
Advertisement
ఢిల్లీ అయితే పంత్ ని వదులుకోవడానికి ఇష్టపడదు. రోహిత్ శర్మను ముంబై కొనసాగిస్తుంది. కాని మన హైదరాబాద్ టీం మాత్రం పట్టించుకోవడం లేదు. లక్ష్మణ్ కూడా వేలంలో పాల్గొన్నా సరే మన ఆటగాళ్ళ మీద ఆసక్తి చూపలేదు. హైదరాబాద్ టీం అనే గాని, ఒక్క లక్ష్మణ్ మినహా టీం యాజమాన్యం గాని ఆటగాళ్ళు గాని ఎవరూ మన వాళ్ళు కాదు. తమిళనాడుకి చెందిన సన్ టీవీ కి చెందిన హైదరాబాద్ టీంకి పేరు మాత్రమే మనది.
Advertisements
మన ఉప్పల్ మైదానం వాడుకోవడమే గాని మన వాళ్లకు ప్రాధాన్యత కల్పించడం లేదు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల మీద ఉన్న ఆసక్తి మన టీం మీద లేకపోవడం గమనార్హం. ఇక ఫాన్స్ ఏమో హైదరాబాద్ మనది మనది అంటూ ఉంటారు. పేరు మాత్రమే మనదే అనే వాస్తవం చాలా మందికి తెలియదు. ఆంధ్రా ఆటగాడిని తమిళనాడు కొనుక్కున్నా… హైదరాబాద్ ఆసక్తి చూపలేదు.
Advertisements