Advertisement
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి…..ఫస్ట్ ఎలిమినేషన్స్ లోనే హౌస్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్ సూర్యకిరణ్. సత్యం సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమై మంచి హిట్ కొట్టిన సూర్య కిరణ్ కు ….సత్యం తర్వాతి సినిమాలు నిరాశను కలిగించాయి. హీరోయిన్ కళ్యాణిని పెళ్ళి చేసుకున్నప్పటికీ …ఆ పెళ్లి ఎక్కువ రోజులు నిలబడలేదు.!
సూర్య కిరణ్…డైరెక్ట్ చేసిన 5 సినిమాలు.!
సత్యం :
2003 లో సుమంత్ ,జెనీలియా హీరో హీరోయిన్లుగా…సూర్య కిరణ్ డైరెక్ట్ చేసిన మూవీ సత్యం. కథ, స్క్రీన్ ప్లే, సాంగ్స్ అన్నీ బాగా కుదిరాయి.సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది!
Advertisements
ధన 51 :
2005 లో సుమంత్,సలోని అశ్వని హీరో హీరోయిన్లుగా… సూర్య కిరణ్ డైరెక్ట్ చేసిన మరో చిత్రం ధన 51. తనకు బ్రేక్ ఇచ్చిన హీరోతోనే రెండో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.
Advertisement
రాజు భాయ్ :
2007 లో మంచు మనోజ్ , షీలా కౌర్ హీరో హీరోయిన్లుగా… సూర్య కిరణ్ డైరెక్ట్ చేసిన 3 వ చిత్రం రాజు భాయ్… ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది.
బ్రహ్మాస్త్రం :
2006 లో జగపతి బాబు నేహా ఒబెరాయ్ హీరో హీరోయిన్లుగా.. సూర్య కిరణ్ డైరెక్ట్ చేసిన 4 వ చిత్రం బ్రహ్మాస్త్రం. విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకొచ్చినప్పటికీ ఇది కూడా ఫ్లాప్ గానే నిలిచింది.
చాప్టర్ 6 :
2010 లో కళ్యాణి ప్రధాన పాత్రలో..సూర్య కిరణ్ డైరెక్ట్ చేసిన 5 వ చిత్రం చాప్టర్ 6 . తన భార్య అయిన కళ్యాణీయే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది…. ఈ సినిమా కూడా ఫ్లాప్ గానే నిలిచింది.
Advertisements