Advertisement
గత కొన్ని రోజులుగా LAC ( Line Of Actual Control ) వద్ద చైనా ఆర్మీ సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించి మరీ భారత భూభాగంలోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో కూడా వచ్చాయి.
అయితే తాజాగా మరోమారు చైనీస్ ఆర్మీ…. LAC వద్ద గల గవాన్ వ్యాలీ నుండి భారతదేశంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుండగా…. ఇండియన్ ఆర్మీ వారిని అడ్డగించింది. ఒకవైపు బ్రిగేడియర్ స్థాయి అధికారులు చర్చలు నడుపుతూనే ఉన్నారు. మరోవైపు బోర్డర్లో సైనికుల మద్య తోపులాట ప్రారంభమైంది…తోపులాట క్రమంగా గొడవకు దారితీసింది. రాళ్లు రువ్వుకోవడం.,ఇనుప రాడ్లతో కొట్టుకోవడం ., ఫిజికల్ గా కొట్టుకోవడం జరిగింది.! రాత్రి సమయం అందులోనూ మైనస్ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండడంతో…. సరిగ్గా కనబడని కారణంగా కొంతమంది పక్కనే ఉన్న లోయలో పడిపోయారు.
గొడవ సమసిన తర్వాత చూసుకొని .. కల్నల్ ఇద్దరు సోల్జర్స్ కనబడడం లేదన్న విషయాన్ని గ్రహించిన ఇండియన్ ఆర్మీ లోయలో వెతకగా..కొన ఊపిరితో ఉన్న సంతోష్ కనిపించారు. చికిత్స అందించినప్పటికీ ఆయన బ్రతకలేదు. తమిళనాడు కు చెందిన పజని, ఉత్తరాఖండ్ కు చెందిన ఓజా ఈ ఘటనలో చనిపోయారు. వీరితో పాటు ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిని … మొత్తం 20 మంది భారతసైనికులు మరణించినట్టు తెలుస్తోంది.!
Advertisement
Advertisements
చైనా ఆర్మీలో కూడా దాదాపు , 40 మందికి పైగా చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి.( చైనా దృవీకరించాల్సి ఉంది) ఈ విషయంపై చైనా స్పందిస్తూ…భారత్ సైనికులే రెండు సార్లు బోర్డర్ దాటే ప్రయత్నం చేసిందని..తమ ఆర్మీ అడ్డుకుందని చెప్పొకొచ్చింది.
సంతోష్ తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన వారు. సైన్యంలో చేరాలన్న తన తండ్రి కలను నేరవేర్చాడు. కోరుకొండ సైనిల్ స్కూల్ లో చదివిన సంతోష్ …సైన్యంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం బీహార్ రెజిమెంట్ కల్నల్ గా పనిచేస్తున్నారు. గతంలో పాకిస్థాన్ బోర్డర్ లో కూడా పనిచేశారు. గత 15 నెలల నుండి చైనా బోర్డర్ లో డ్యూటీ చేస్తున్నారు. ఈయనకు ఒక కుమారుడు, ఓ కూమార్తె.
Also Read : చైనా వాళ్లు దాడి చేసింది….వీటితోటే.! ఎంత బాధను భరించి ఉంటారు మన సైనికులు.
Also Read : వైరల్ వీడియో :15 జూన్ న ఇండియా చైనా సైనికుల మద్య జరిగిన ఘర్షణ.
Also Read : 800 గొర్రెలతో చైనాకు చుక్కలు చూపించిన అటల్ బీహారీ వాజ్ పేయ్.!
Advertisements
Also Read : నిజాం తన మీదకు విసిరిన చెప్పును వేలానికి పెట్టి….ఆ నిజాం కే షాకిచ్చాడు.! గడిచిన గతం.