Advertisement
బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ నెల 14న ఆత్మహత్య చేసుకుని బలవణ్మరనానికి పాల్పడిన విషయం విదితమే..డిప్రెషన్ కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని నిర్దారణకు వచ్చినప్పటికి, అసలు సుశాంత్ డిప్రెషన్ కు కారణాలేంటి..ఆత్మహత్య వరకు దారి తీసిన పరిస్థితులు ఏంటి అని విచారిస్తున్నారు ముంబై పోలీసులు..ఇప్పటి వరకు కుటుంబసభ్యులు,స్నేహితులు మరియు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో కలిపి మొత్తం 14మంది వాంగ్మూలం సేకరించారు..
సుశాంత్ గత ఆరు నెలలుగా నిరాశతో బాధపడుతున్నట్టుగా సమాచారం…సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన బాంద్రాలోని అతని ఇంట్లో యాంటీ – డిప్రెసెంట్ మాత్రలతో పాటు అతని మెడికల్ ప్రిస్క్రిప్షన్ లభించాయి….డిప్రెషన్ కి గురైన మొదట్లో మందులు వాడిన సుశాంత్ ఆ తర్వాత వాటిని తీసుకోవడం మానేసాడని పోలీసుల దర్యాప్తులో తేలింది..
పోలీసులు విచారించిన వారిలో సుశాంత్ తండ్రి, సిస్టర్స్ , సుశాంత్ క్రియేటివ్ మేనేజర్ మరియు ప్లాట్మేట్ సిద్దార్ద్ ఫిథాని, సందీప్ సావంత్, సుశాంత్ ఫ్రెండ్ మరియు నటుడు మహేశ్ శెట్టి, కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చబ్రా, బిజినెస్ మేనేజర్ శృతి మోడీ, పిఆర్ అంకిత టెహ్లానీ, సుశాంత్ ఇంట్లో పనిచేసే సర్వెంట్స్ ఇద్దరు, కీ మేకర్ ఒకరు,మరియు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి..ఉన్నారు..
Advertisements
Advertisement
- సుశాంత్ డిప్రెషన్ తో బాధపడుతున్న విషయం తనకు తెలియదని సుశాంత్ ఫాదర్ కెకె సింగ్ చెప్పడం గమనార్హం.
- సుశాంత్ చివరి సారి ఫోన్ మాట్లాడిన మహేశ్ శెట్టి అనే నటుడిని విచారించారు పోలీసులు.
- సుశాంత్ సర్వెంట్స్ ని విచారించగా… చనిపోవడానికి మూడు రోజుల ముందే వారివారి జీతాలకంటే రెట్టింపు డబ్బులు సుశాంత్ ఇచ్చినట్టుగా తెలుసింది.
- సుశాంత్ గర్ల ఫ్రెండ్ రియాను సుమారు 9గంటల పాటు విచారించారు పోలీసులు..డిప్రెషన్ కి సంబంధించిన మందులు వాడమంటే సుశాంత్ మానేసాడని, జూన్ 6న సుశాంత్ సింగ్ ని చివరిసారి కలిసానని చెప్పింది..ఆ రోజు కూడా సుశాంతే తనను వెళ్లిపొమ్మన్నాడని, ఆ తర్వాత తను వాళ్ల సిస్టర్ కి కాల్ చేసి సుశాంత్ దగ్గరకి వచ్చి ఉండమని చెప్పినట్టుగా కూడా రియా తన వాంగ్మూలం ఇచ్చింది.
Advertisements
- సుశాంత్ అంత్యక్రియలకు రియా రాలేదనే ఆరోపణలున్నాయి సుశాంత్ కుటుంబం అభ్యంతరం చెప్పింనందుకే రియా అంత్యక్రియలకు అటెండ్ కాలేదని సమాచారం.
- వార్తల్లో వస్తున్నట్టుగా సుశాంత్ మరణానికి కొందరి ప్రవర్తనే కారణం అన్నట్టగా సుశాంత్ కుటుంబ సభ్యులు కానీ,స్నేహితులు కాని ఎవరూ కూడా వారి వారి వాంగ్మూలంలో అలాంటి ఆరోపణలు చేయలేదని సమాచారం.
- ఒకవేళ ఆధారాలు నిజమైతే పోలీసులు త్వరలో బాలీవుడ్ పరిశ్రమకు చెందిన మూడు ప్రసిద్ధ ప్రొడక్షన్ హౌస్‌ల అధిపతులతో పాటు దర్శకుడు శేఖర్ కపూర్ ని కూడా విచారణకు పిలవనున్నారు.