Advertisement
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ తీవ్రమైన డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్దారించి కేసు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతనిది ఆత్మహత్య కాదని, హత్యేనని అవనీంద్ర అనబడే ఓ క్రిమినల్ లాయర్ పేర్కొన్నారు. అందుకు గాను ఆయన పలు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆయన పెట్టిన ఆ పోస్టులో సుశాంత్ సింగ్ డెడ్‌బాడీ ఫొటో ఉన్నందున ఆ పోస్టును డిలీట్ చేశారు కానీ.. ఆ పోస్టు స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతోంది. అందులో ఉన్న అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే…
View this post on InstagramAdvertisements
1. ఈత బాగా వచ్చిన వారు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ఆ పని చేసినా వారికి ఆ పని సాధ్యం కాదట. ఎందుకంటే వారు చివరి నిమిషంలో అయినా సరే ఆ పని నుంచి విరమించుకుంటారట. అలాగే తన బరువును తాను స్వయంగా మెయింటెయిన్ చేసే సుశాంత్ లాంటి వారు ఉరి వేసుకుని కూడా చనిపోలేరట. వారు కూడా చివరి నిమిషంలో ఆ పని చేయడం మానుకుంటారట. ఇది క్రిమినల్ లా లో స్పష్టంగా ఉంది. అందువల్ల సుశాంత్‌ది హత్య అయి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది.
2. ఊపిరి ఆడకపోవడం వల్ల సుశాంత్ చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలో వచ్చింది. అయితే ఉరి వేసుకుంటానికి ముందు ఊపిరి ఆగిపోయిందా, తరువాతనా అనే విషయంలో స్పష్టత లేదు. అంటే.. ఎవరైనా గొంతు నులిమి, లేదా ఇతర పద్ధతుల్లో శ్వాస ఆడకుండా చేసి చంపి.. తరువాత ఉరి వేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయవచ్చు కదా. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు దాన్ని ఆత్మహత్యగానే భావించి కేసు దర్యాప్తు ఆపేసే అవకాశం కూడా ఉంది.
3. ఇర్ఫాన్‌ఖాన్ చనిపోయాక ఫిలిం మేకర్ ఆనంద్ గాంధీ తన తరువాత సినిమా ఎమర్జెన్స్‌లో ఇర్ఫాన్‌కు బదులుగా సుశాంత్‌ను తీసుకుందామని ఫిక్సయ్యారు. అందువల్ల సుశాంత్.. బాలీవుడ్‌లో ఓ వర్గం వారు దూరం పెట్టడం వల్లే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనడంలో అర్థం లేదు. సుశాంత్‌కు ఆఫర్లు ఇప్పటికీ ఉన్నాయని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. అలాంటప్పుడు అతను ఆత్మహత్య చేసుకోడు కదా.. కనుక అది హత్యే అయి ఉంటుందని అంటున్నారు.
4. సుశాంత్ చనిపోవడానికి వారం ముందు అతని మాజీ మేనేజర్ దిశ సలియన్ తాను ఉంటున్న భవనం 14వ అంతస్థు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. అలాగే సుశాంత్ మరో ఇద్దర స్నేహితులు మన్మీత్ గ్రెవాల్, ప్రకాష్ మెహతాలు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిలో స్పష్టత లేకపోయినా.. ఈ చావులన్నింటికీ ఏదో ఒక లింక్ ఉన్నట్లు తెలుస్తుంది.
5. సుశాంత్ కర్టెయిన్స్‌ను ఉపయోగించి ఉరి వేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. కానీ అతని మెడపై ప్లాస్టిక్ తాడు బిగించినట్లు గుర్తులు ఉన్నాయి. అతని డెడ్‌బాడీ ఫొటోలను చూస్తే మనకు ఇది అర్థమవుతుంది. అందువల్ల ఇది కచ్చితంగా హత్యే అయి ఉంటుందని అనుమానాలు కలుగుతున్నాయి.
6. సుశాంత్ ఆ రోజు ఉదయం 9 గంటలకు తన సోదరితో ఫోన్‌లో మాట్లాడాడని పోలీసులు తెలిపారు. 9.30 గంటలకు బయటకు వచ్చిన దానిమ్మ పండు జ్యూస్ తాగి మళ్లీ గదిలోకి వెళ్లినట్లు పనివాళ్లు చెప్పారు. ఆత్మహత్య చేసుకోబోయేవాడు దానిమ్మ పండు జ్యూస్ ఎందుకు తాగుతాడు ? ఇది ఆలోచించాల్సిన విషయమే.
7. సుశాంత్ తన చివరి మూవీ దిల్ బేచారా తరువాత కేవలం టీవీ సిరీస్‌లలో మాత్రమే నటించాలని చెప్పి బాలీవుడ్ అతన్ని దూరం పెట్టిందని అంటున్నారు. అయితే ఇందులో ఏ మాత్రం అర్థం లేదు. దీనికి అతని చావుకు సంబంధం లేకపోవచ్చు.
8. సుశాంత్‌కు కుటుంబం పరంగా ఎలాంటి సమస్యలు లేవు. అతను నిత్యం వారితో టచ్‌లోనే ఉంటున్నాడు. అతను చనిపోవడానికి ముందు రోజు రాత్రి తనకు చాలా దగ్గరైన పలువురు స్నేహితులతో గ్రూప్ పార్టీ చేసుకున్నాడు. అయితే అతను డిప్రెషన్‌లో ఉన్నాడని తెలుసుకున్న ఎవరైనా ఆ విషయాన్ని అతన్ని హత్య చేసేందుకు ఒక ముఖ్యమైన మార్గంగా ఎంచుకుని ఉండవచ్చు. ఇది అతను కచ్చితంగా హత్యకు గురయ్యాడని చెప్పేందుకు ఒక బలమైన ఉదాహరణ అని భావించవచ్చు.
Advertisement
9. సుశాంత్ ఏ విషయంలోనూ అంత త్వరగా ఓటమిని అంగీకరించేవాడు కాదని.. మాజీ ఎంపీ పప్పు యాదవ్ అన్నారు. అతను ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని, అతన్ని హత్య చేశారని ఆయన ఆరోపించారు. అలాగే సుశాంత్ కుటుంబ సభ్యులు, మేనమామ కూడా అతను ఆత్మహత్య చేసుకోలేదని, అతన్ని ఎవరో హత్య చేశారని అన్నారు. కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, కనుక వారు రాజకీయ, బాలీవుడ్ ప్రముఖులను రక్షించేందుకు యత్నించే అవకాశం ఉందని ఆరోపించారు.
10. సాధారణంగా ఆత్మహత్య చేసుకునే చాలా మంది సూసైడ్ నోట్లను రాస్తారు. తాము ఎందుకు చనిపోతున్నామో, అందుకు ఎవరు కారకులో తెలుపుతూ.. తమ చివరి మాటలను రాస్తారు. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ఉంటే సూసైడ్ నోట్ ఎందుకు రాయలేదు, నిజంగానే రాశాడా, రాసి ఉంటే ఎందుకు లభించలేదు ? అనే సందేహాలు కలుగుతున్నాయి.
11. సుశాంత్ గతంలో పలుమార్లు ఆత్మహత్యలు చేసుకోకూడదని సందేశాలు ఇచ్చాడు. అలాగే అతని సినిమా చిచోరేలోనూ జీవితంపై ఎప్పుడూ విరక్తి చెందకూడదని, అంత సులభంగా మనం ఓటమిని అంగీకరించకూడదని సందేశం ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.. అంటే.. అది అనుమానాస్పదమే..
12. సుశాంత్‌కు కచ్చితంగా కుటుంబ సమస్యలే కాదు, ఆర్థిక సమస్యలు కూడా లేవు. చాలా మంది ఈ రెండు కారణాలతోనే ఆత్మహత్య చేసుకుంటారు. కెరీర్ కారణంగా ఆత్మహత్య చేసుకునే వారు చాలా అరుదుగా ఉంటారు. కానీ సుశాంత్‌కు ఆ సమస్య కూడా లేదు. అందుకని అతనిది ఆత్మహత్య కాదని, హత్యేనని రుజువు అవుతుంది.
13. సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సలియన్ చనిపోయాక రచయిత, దర్శకుడు రమీ జఫ్రీ సుశాంత్‌కు సందేశం పంపాడు. జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అందుకు సుశాంత్.. లవ్ యూ సర్, మనం త్వరలో కలుద్దాం.. అని రిప్లయి ఇచ్చాడు. ఇలాగే సుశాంత్ పలువురికి రిప్లయిలు ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే అతను డిప్రెషన్‌లో లేడని, కెరీర్ పరంగా కూడా బాగానే ఉన్నాడని అర్థమవుతుంది. అలాంటి వాడు ఆత్మహత్య చేసుకున్నాడంటే నిజంగా ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు.
సుశాంత్ గురించి చదివిన కొద్దీ బాధే కలుగుతుంది. అతను తన జ్ఞానం, వ్యక్తిత్వం, చర్యల మూలంగా ఎంతో మందిపై పాజిటివ్‌గా ప్రభావం చూపి ఉండేవాడు. అతను తాను పూర్తి చేద్దామని అనుకున్న 50 కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. అత్యంత అణకువ, తెలివితేటలు, మానవత్వం ఉన్న సుశాంత్ అంత త్వరగా చనిపోవడం మిక్కిలి బాధాకరం.
ఒక వేళ సుశాంత్‌ను నిజంగా ఎవరైనా హత్య చేసి ఉంటే.. చరిత్రలో అది ఆత్మహత్యగానే మిగిలిపోతే దానికి మనమందరం సిగ్గు పడాల్సిందే. అయితే అతనిది హత్యే అయి ఉంటే మనం నిజంగా అతనికి న్యాయం జరిగేంత వరకు పోరాడాలి. అదే ఆత్మహత్య అయితే అతను ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది ? ఏదైనా డిప్రెషన్‌లో ఉన్నాడా ? అందుకు కారణాలేమిటి ? అన్న విషయాలను తెలుసుకోవాలి. ఈ విషయంలో నిందితులను మాత్రం చట్టాలు విడిచిపెట్టకూడదు.
సోషల్ మీడియాలోనే కాదు, బయటి ప్రపంచంలోనూ ప్రస్తుతం సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా.. సుశాంత్‌ది ఆత్మహత్యేనని, డిప్రెషన్‌తో చనిపోయాడని, బాలీవుడ్‌లో ఉన్న బంధుప్రీతి వల్ల, తనను ఓ వర్గం దూరం పెట్టడం వల్లే డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నాడని.. ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల అసలు విషయం మరుగున పడిపోయే అవకాశం ఉంది. కనుక అలా జరగక ముందే సుశాంత్‌ది హత్యా, ఆత్మహత్యా అని తేలాల్సి ఉంది. మీడియా కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. అతనిది సూసైడా, మర్డరా అని తేల్చేలా చర్చలు నిర్వహించాలి. ఏ విధంగా అతను చనిపోయినా సరే.. అందుకు కారణమైన వారిని గుర్తించి చట్ట ప్రకారం వారికి శిక్ష పడేలా చేయాలి. అప్పుడే సుశాంత్ ఆత్మకు శాంతి కలుగుతుంది.
Advertisements