Advertisement
సుశాంత్ మరణం తర్వాత గత 30 రోజులుగా తాము సేకరించిన సాక్ష్యాలు, ఆధారాలతో ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడానికి పోలీసులు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. విసేరా (అంతర్గత అవయవాల పనితీరు) రిపోర్ట్ వచ్చాక…. తమ రిపోర్ట్ ను తెలిపి కేసును క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.!
పోలీసులు ఫైనల్ చేసిన సాక్ష్యాలేవి?
సుశాంత్ ది ఆత్మహత్యే అనేది ఆ రిపోర్ట్ లో ఉండబోతోంది. దానికి వారు సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేశారు.
గదిలోపలి నుండి లాక్ : గదిలోపలి నుండి లాక్ చేసి ఉంది…మెకానిక్ ను తీసుకొచ్చి తాళాన్ని తీయించారు. అంటే బయటి వ్యక్తి ఎవ్వరూ లోపలికి రాలేదు. ఈ విషయాన్ని సుశాంత్ సోదరితో సహా మెకానిక్ కూడా ధృవీకరించారు.
Advertisements
Advertisement
తాళం, తలుపు, సుశాంత్ బట్టలు: సుశాంత్ బట్టలను, తలుపును, తాళాన్ని ….క్షుణ్ణంగా పరిశీలించాక…అవన్నీ సాదారణ స్థితిలోనే ఉన్నట్టు వెరిఫై చేశారు. అంటే దాడి జరిగింది అనడానికి ఛాన్స్ లేదు.
మంచం-ఫ్యాన్: మంచంలో నిలబడ్డ సుశాంత్ కు ఫ్యాన్ కు కేవలం 1 ఇంచ్ డిస్టెన్స్ యే ఉండడంతో సుశాంత్ యే స్వయంగా ఉరివేసుకున్నాడనే అంచనాకొచ్చారు.
శరీరంపై గాయం గుర్తులు లేకపోవడం, డిప్రెషన్ కు సంబంధిచిన మెడికేషన్ లో ఉండడం కూడా సుశాంత్ ది ఆత్మహత్యే అని ధృవీకరిస్తున్నాయి.
ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాదారులుగా 6 గురిని విచారించిన పోలీసులు…వారి నుండి వివిధ కోణాల్లో సమాధానాలు రాబట్టి…. ఫైనల్ రిపోర్ట్ తయారు చేశారు. జులై ఎండింగ్ లోపు కేసును క్లోజ్ చేయనున్నట్టు సమాచారం.!
Advertisements