Advertisement
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలోని పలువురిని ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. అయితే సుశాంత్ పనిమనిషి నీరజ్ సింగ్ సుశాంగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుశాంత్ సింగ్‌కు గంజా యి తాగే అలవాటు ఉండేదని, అతను, రియా, మరికొందరు స్నేహితులు కలిసి వారం వారం పార్టీలు చేసుకునేవారని, ఆ సమయంలో మద్యం సేవించడంతోపాటు గంజా యి కూడా తాగేవారని అన్నాడు.
సుశాంత్ సింగ్ పనిమనిషి నీరజ్ సింగ్ ముంబై పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రస్తుతం మీడియాకు చిక్కింది. అందులో సంచలన విషయాలు బయట పడ్డాయి. ఏప్రిల్ 2019లో నీరజ్ సింగ్ సుశాంత్ వద్ద పార్ట్ టైం హౌజ్ కీపింగ్ పనిచేసేవాడు. అయితే కొద్ది రోజుల పాటు అతను అనారోగ్యం కారణంగా పనికి రాలేదు. మళ్లీ మే 2019లో అప్పటి సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా నీరజ్‌కు కాల్ చేసి పనికి రమ్మన్నాడు. దీంతో నీరజ్ మళ్లీ పనికి రావడం మొదలు పెట్టాడు. అప్పట్లో సుశాంత్ ముంబైలోని కాప్రి హైట్స్ పాలి మార్కెట్ నివాసంలో ఉండేవాడు.
Advertisement
అయితే ఆ నివాసంలో సుశాంత్ నీరజ్‌తో వాకీ టాకీల ద్వారా సంభాషించేవారు. ఈ క్రమంలో ఒక రోజు వాకీ టాకీలో నీరజ్‌కు.. నీరజ్ లైట్లు ఆఫ్ చేయి.. అని సుశాంత్ గొంతు వినిపించింది. దీంతో నీరజ్ సుశాంత్ బెడ్‌రూంలోకి వెళ్లి చూడగా.. అప్పటికే లైట్లు ఆఫ్ అయి ఉన్నాయి. అలాగే సుశాంత్ నిద్రలో ఉన్నాడు. ఇక మరోసారి కూడా నీరజ్‌కు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అలాగే రాత్రిళ్లు లిఫ్ట్ దానికదే పైకి కిందకు కదిలేది. మరోవైపు అర్థరాత్రి పూట డప్పు చప్పుళ్లు వినబడేవి. దీంతో సుశాంత్ డిసెంబర్ 2019లో తన నివాసాన్ని బాంద్రాలోని జాగర్స్ పార్క్‌లో ఉన్న మౌంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్‌కు మార్చాడని నీరజ్ తెలిపాడు.
అయితే సుశాంత్ చనిపోయేందుకు కొద్ది రోజుల ముందు నుంచీ గంజా యి తాగేవాడని నీరజ్ తెలిపాడు. ఆనంది, రియాలతో కలిసి సుశాంత్ తన ఇంట్లో వారంలో రెండు సార్లు పార్టీలు పార్టీలు చేసుకునేవాడని, ఆ సమయంలో మద్యంతోపాటు గంజా యి కూడా తాగేవాడని నీరజ్ తెలిపాడు. ఇక సుశాంత్ చనిపోయేందుకు 3 రోజుల ముందు కొన్ని గంజా యి సిగరెట్లను చుట్టి ఇచ్చానని, వాటిని ఇంట్లో మెట్ల వద్ద ఉన్న కప్‌బోర్డులో ఓ సిగ రెట్ బాక్సులో సుశాంత్ పెట్టుకున్నాడని, కానీ సుశాంత్ చనిపోయాక ఆ బాక్సును ఓపెన్ చేస్తే అందులో గంజా యి సిగ రెట్లు లేవని నీరజ్ తెలిపాడు. దీంతో నీరజ్ ముంబై పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుండగా.. రోజుకో కొత్త విషయం బయట పడుతోంది. ఇంకా ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎలాంటి ఊహించని ట్విస్టులు బయట పడతాయో చూడాలి.
Advertisements
Advertisements