Advertisement
సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మరణంపై సీబీఐచే దర్యాప్తు చేయించాలనే డిమాండ్ రోజు రోజుకీ అధికంగా వినిపిస్తోంది. నెటిజన్లు #justiceforsushantsinghrajput, #cbiforsushant అనే హ్యాష్‌టాగ్‌ల పేరిట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్‌లను నిర్వహిస్తున్నారు. సుశాంత్ సింగ్ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నెటిజన్లకు పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన ఎంపీ రూపా గంగూలీ అయితే సుశాంత్ సింగ్ మృతికి కారకులైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని అంటున్నారు.
”సుశాంత్ సింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గుతోంది. ఇది ఎలా సాధ్యం ? ముఖ్యమైన సాక్ష్యాలను తారుమారు చేసేందుకు జరుగుతున్న కుట్రగా దీన్ని పేర్కొనవచ్చు. మొదట ఈ విషయాన్ని నేను నమ్మలేదు. కానీ కొన్ని స్క్రీన్ షాట్లు చూశా. కొన్ని స్క్రీన్ షాట్లను నేను కూడా తీసుకున్నా. తరువాతే ఇది నిజమని నమ్మా. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది ? సీబీఐ దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది ? అన్ని సాక్ష్యాలూ నాశనం అయ్యాక దర్యాప్తు ప్రారంభిస్తారా ?..” అని రూపా గంగూలీ అన్నారు. సుశాంత్ సింగ్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అన్నారు. అతని ఇన్‌స్టాగ్రాం ఖాతాను ఇప్పటికీ ఎవరో ఆపరేట్ చేస్తున్నారని, అతని ఫాలోవర్ల సంఖ్య తగ్గుతూ వస్తుందని.. ఆమె ఆరోపించారు.
సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేసే యత్నం జరుగుతున్న మాట వాస్తవమే అయితే వెంటనే సీబీఐ దర్యాప్తు చేయాలని అన్నారు. ఈ మేరకు ఆమె #cbiforsushant అనే హ్యాష్ ట్యాగ్‌ను తన ట్విట్టర్ పోస్టులకు జోడించారు.
Advertisements
Advertisement
ఇక నెటిజన్లు కూడా సుశాంత్ ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య తగ్గుతుందనే అంటున్నారు.
సుశాంత్ ఇన్‌స్టా ఖాతాలో పలువురు యూజర్లు చేసిన కామెంట్లను కూడా డిలీట్ చేస్తున్నారని.. దీనర్థం.. సుశాంత్ ఇన్‌స్టా ఖాతాను ఇప్పటికీ ఎవరో ఆపరేట్ చేస్తున్నారని తెలుస్తుందని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక రూపా గంగూలీ ఈ కేసు దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సుశాంత్ మరణించిన తరువాతి రోజు ఫోరెన్సిక్ బృందం వచ్చిందని, అంత ఆలస్యం ఎందుకు అయిందని అన్నారు. వారి ఆలస్యం కారణంగా ఫింగర్‌ప్రింట్స్ లభించకుండా పోయాయని, అలాగే అతను ఏ మెడిసిన్ తీసుకుంటున్నాడు, అతని ఇంటికి సీల్ ఎందుకు వేయలేదో కూడా అధికారులు జనాలకు తెలియకుండా సమాచారం దాస్తున్నారని.. ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లు చేశారు.
అయితే సుశాంత్ సింగ్ ఇన్‌స్టా ఖాతాలో ఉన్న పలు ఫొటోలను కూడా డిలీట్ చేస్తున్నారని ఇది వరకే సౌమ్యా దీప్తా అనే జర్నలిస్టు వెల్లడించారు. అతని ఇన్‌స్టా పాస్‌వర్డ్ అతని కుటుంబ సభ్యులకు తెలియదని, అలాంటప్పుడు ఆ ఖాతాను ఆపరేట్ చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ పరిణామాలను గమనిస్తుంటే సుశాంత్ మరణానికి సంబంధించిన కీలక ఆధారాలను ఎవరో మాయం చేస్తున్నట్లు అర్థమవుతుందని, ఈ విషయంపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.
I am quite shocked at what I have just heard and then seen myself
Is anyone operating Sushant's phone?
How is his Instagram account unfollowing people "he" followed?
CBI 's presence isn't required ?#cbiforsushant #roopaganguly @AmitShah @narendramodi pic.twitter.com/Autr6urJ5u— Roopa Ganguly (@RoopaSpeaks) June 25, 2020
Advertisements