Advertisement
బాలివుడ్ నటుడు 34 ఏళ్ల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అర్దాంతరంగా తనువు చాలించాడు.. అతని జీవితాన్ని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తూనే ఉన్నాయి.. నేషనల్ లెవల్ ఫిజిక్స్ ఒలింపియాడ్..ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేషనల్ వైడ్ సెవెన్త్ ర్యాంక్ సాధించాడు..నటనపై ఆసక్తితో మొదట బుల్లితెర,తర్వాత సినిమాల్లోకి వచ్చాడు..సుశాంత్ తొలి జీతం 250రూ అయితే..తర్వాత తర్వాత అతడు చంద్రునిపై ప్లాట్ కొనే స్థాయికి ఎదిగాడు…చంద్రునిపై ఉన్న తన ప్లాట్ ను చూడడానికి ప్రత్యేక బైనాక్యులర్స్ కూడా సుశాంత్ దగ్గర ఉండేవి..
మొదట సంపాదించినది 250 రూపాయలు
తొలిరోజుల్లో ఆరుగురితో కలిపి ఒకే రూమ్ లో ఉండేవాడు సుశాంత్.. ఒక నాటకానికి గాను తాను తీసుకున్న పారితోషికం 250రూపాయలు.. ఆ టైంలో డబ్బుల కోసం కొన్ని సార్లు సినిమాల్లో హీరో హీరోయిన్ వెనుక ఉండే సైడ్ డ్యాన్సర్ గా కూడా చేశాడు సుశాంత్.
2008 లో మొదటి టీవీ షో
Advertisements
ముంబైలో చాలా సంవత్సరాలు కష్టపడిన తరువాత 2008 లో బాలాజీ టెలిఫిల్మ్స్ షో ‘కిస్ దేశ్ మెయి హై మేరా దిల్’ తో సుశాంత్ టీవీలో ఫస్ట్ ఛాన్స్ పొందాడు..తర్వాత 2009నుండి 2011 మధ్య వచ్చిన పవిత్ర రిస్తా సీరియల్ సుశాంత్ కెరీర్ గ్రాఫ్ ని అమాంతం మార్చేసింది..ఆ సీరియల్లో సుశాంత్ నటన ద్వారా ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత 2013లో “కై పో చే” సినిమా ఛాన్స్ తో వెండితెరపై వెలుగొందాడు.
Advertisement
2015 లో పెంట్ హౌస్ కొన్నారు
ఒకప్పుడు ముంబైలోని మలాడ్‌లోని 2 బిహెచ్‌కె అపార్ట్‌మెంట్‌లో నివసించిన సుశాంత్ 2015 లో పాలి హిల్‌లో పెంట్ హౌస్ కొన్నాడు. ఇందుకోసం 20 కోట్ల రూపాయలు చెల్లించాడు. సుశాంత్ తన లివింగ్ రూమ్ ని “ట్రావెల్ రూమ్” అని పిలిచేవాడు. సుశాంత్ ఇంట్లో పెద్ద టెలిస్కోప్ ఉండేది, దానిని అతను ‘టైమ్ మెషిన్’ అని పిలిచేవాడు. ఇంట్లో కూర్చునే వివిధ గ్రహాలు మరియు గెలాక్సీలను చూసేవాడు.
ఒక చిత్రానికి 5 నుండి 7 కోట్లు తీసుకునేవాడు
సుశాంత్ ఖాతాలో ‘ఎంఎస్ ధోని’, ‘కేదార్‌నాథ్’ వంటి హిట్‌లు ఉన్నాయి. అమీర్ ఖాన్, అనుష్క శర్మ నటించిన ‘పికె’ లో కూడా సుశాంత్ కి మంచి పాత్ర లభించింది.. ప్రస్తుతం, సుశాంత్ ఒక చిత్రానికి 5 నుండి 7 కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడు.. సినిమాలతో పాటు, యాడ్స్ మరియు స్టేజ్ షోలు కూడా చేస్తున్నాడు.
లగ్జరీ కార్ మరియు బైక్ యజమాని సుశాంత్
సుశాంత్ రకరకాల కార్ల ను, బైక్ లను సేకరించేవాడు..సుమారు కోటిన్నర విలువ చేసే క్వాట్రోపోర్టో వంటి లగ్జరీ కార్ , BMW K1300R బైక్ ఉన్నాయి. ఈ బైక్ ధర సుమారు 25 లక్షల రూపాయలు..
Advertisements
సుశాంత్ కూడా చంద్రునిపై భూమి కొన్నాడు
సుశాంత్ 2018 లో చంద్రునిపై భూమిని కొన్నాడు. అతని ప్లాట్లు ముస్కోవి సముద్రంలో ఉన్నాయి. తన ప్లాట్లను చూడడానికి ప్రత్యేకంగా ఒక టెలిస్కోప్ కూడా కొన్నాడు.