Advertisement
హస్త సాముద్రికం.. చేతి రేఖలను బట్టి భవిష్యత్ ని చెప్పగలగడం..మనదేశంలో జాతకాలు, హస్తసాముద్రికానికి విశిష్ట ఖ్యాతి ఉంది..కొందరు ఇవన్ని మూఢనమ్మకాలు అని కొట్టిపారేసినప్పటికి.. గొప్పగొప్పవాళ్లు కూడా వీటిని నమ్ముతూ ఉంటారు.. ప్రస్తుతం సుశాంత్ చేతిరేఖల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది..
మొదటి నుండి సుశాంత్ మరణానికి అతని ప్రియురాలు రియానే కారణం అనే వార్తలు వస్తున్నాయి..వాటిని బలపరుస్తూ రోజుకొక అంశం వెలుగులోకి వస్తుంది.. తాజాగా సుశాంత్ చేతిరేఖలు కూడా తను ఆత్మహత్య ద్వారా మరణించలేదని.. మ ర్డర్ చేయబడ్డాడని చెప్తున్నాయంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. సుశాంత్ కుడి చేతిపై ఉన్న రేఖల్లో హార్ట్ లైన్,హెడ్ లైన్, లైఫ్ లైన్ మూడు కూడా కలిసిపోయి ఉన్నాయి..ఈ విధంగా కలిసిపోయి ఉంటే ఆ వ్యక్తి హత్యకి గురవుతాడిని చిరాలజి(హస్తసాముద్రిక శాస్త్రం) చెప్తుందట..
Advertisement
Advertisements
సుశాంత్ మరణించి రెండు నెలలు కావస్తోంది…యువనటుడు డిప్రెషన్తో బాధపడి సూ_సైడ్ చేస్కున్నాడనే వార్త తెలియగానే అనేకమంది షాక్ కి గురయ్యారు..తను అంత పిరికివాడు కాదని, డిప్రెషన్ లాంటిది ఏం లేదని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెప్తుంటే..డిప్రెషన్ కారణంగా మరణించాడనే ముంబయ్ పోలీసులు కేస్ క్లోజ్ చేయబోయారు.. ఎట్టకేలకు కుటుంబసభ్యుల అభ్యర్దన ,అభిమానుల డిమాండ్ తో సిబిఐని కేస్ టేకప్ చేయాల్సింది ఆదేశాలిచ్చింది సుప్రిం..సిబిఐ ఏం తేలుస్తుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Advertisements