Advertisement
ఈ పాప పేరు స్వప్నాలి..మహారాష్ట్రలోని సిందుదర్గ్ జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరులో ఉంటుంది. ఇటీవలే +2 కంప్లీట్ చేసుకొని …. MBBS సీట్ కోసం తీవ్రంగా శ్రమిస్తుంది! కొరోనా కారణంగా కోచింగ్ సెంటర్లు లేకపోవడంతో…. యూట్యూబ్ క్లాసులు, ఆన్ లైన్ క్లాసులను వింటూ తన ప్రిపరేషన్ ను కొనసాగిస్తుంది!
దీని కోసం స్వాప్నాలి పెద్ద యుద్దమే చేయాల్సి వచ్చింది…ఎందుకంటే స్వప్నాలి ఊర్లో నెట్ వర్క్ సిగ్నల్ రాదు…దీంతో ఆమె తన సోదరులతో కలిసి ఎక్కడ నెట్ వర్క్ వస్తుందో చెక్ చేసింది …వారి ఊరికి 2 కిలో మీటర్ల దూరంలో…. ఓ దగ్గర సిగ్నల్ బాగా ఉండడంతో అక్కడే చెట్ల కింద కూర్చొని ఆన్ లైన్ క్లాసులు వినేది.
Advertisement
వర్షాలు రావడంతో కొన్ని రోజులు…గొడుగును పట్టుకొని చదివింది. వర్షానికి పుస్తకాలు తడిసిపోతుండంతో….స్వప్నాలి సోదరులు …..ఆ అడవిలోనే ఆమె కోసం చిన్న గుడిసెను ఏర్పాటు చేశారు. దీంతో స్వప్నాలి ప్రతిరోజు ఇంటి నుండి బయలు దేరి….ఈ గుడిసెకు చేరుకొని క్లాసులు అన్నీ విని…సాయంత్రం ఇంటికి వెళుతుంది. స్వప్నాలి గురించి తెలుసుకున్న ఓ టీచర్ ఆమెకు పవర్ బ్యాంక్ ను గిప్ట్ గా కొనిచ్చాడు! ఆమె సోదరులు కూడా ఆమె ప్రిపరేషన్ అయిపోయే వరకు ఆమెతో పాటే ఉంటారు.! సంకల్పం ముందు ఎంత పెద్ద సమస్య అయినా….దూదిపింజే అవుతుంది అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ స్వప్నాలి! స్వప్నాలికి MBBS ఎంట్రన్స్ లో మంచి ర్యాంక్ రావాలని కోరుకుందాం!
Advertisements
స్వప్నాలికి అండగా సోనూసూద్
స్వప్నాలి కష్టాన్ని తెల్సుకున్న సోనూసూద్….ఈ ఊరికి వైఫై తెప్పించే ప్రయత్నం చేస్తానని హమీ ఇచ్చాడు.
Advertisements