Advertisement
ILU శ్వేత… ఇక నేను ఆగలేను. నిన్ను చూడకుండా ఉండలేను, మన బిటెక్ కంప్లీట్ కాగానే, ఎదో ఒక జాబ్ లో జాయిన్ అయ్యి వెంటనే పెళ్ళి చేసుకుందాం.ఏమంటావ్..? అన్నాడు అటునుండి ఫోన్ లో మనోజ్. సరే బాబూ సరే..ఉంటా బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది శ్వేత వాళ్ళ నాన్న బూట్ల చప్పుడు విని., మనోజ్ శ్వేతలిద్దరూ బిటెక్ ఫస్ట్ ఇయర్ నుండి లవర్స్.. శ్వేతది అమలాపురం, హైద్రాబాద్ లో పెదనాన్న వాళ్లింట్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతుంది..ఫ్యామిలీలో అందరూ యమ స్ట్రిక్ట్, అందుకే చదివేది ఇంజనీరింగ్ అయినా శ్వేత చేతిలో ఇప్పటికీ ఫోన్ లేదు.
క్యాంపస్ అంతా కోలాహలంగా ఉంది.. దసరా హాలిడేస్ తర్వాత స్టూడెంట్స్ అందరూ పుల్ జోష్ తో ఉన్నారు. హైఫై లు , హగ్గింగ్స్, క్యాంటీన్లో కాఫీలతో చాలా మంది గుంపులు గుంపులుగా ముచ్చట్లలో పడిపోయారు. కొందరు లవర్స్ అయితే తమ విరహతాపాన్ని అక్కడే తీర్చుకుంటున్నారు ఒకరి కౌగిళిలోకి మరొకరు ఒరిగి.! వివేక్ పరిగెత్తుకుంటూ వచ్చాడు…అరేయ్ మరో టెన్ డేస్ తర్వాత మన ఫైనల్ ఎగ్జామ్స్ అంటరా..మామా..! అంటూ క్యాంటీన్లో బాతాకానీ కొడుతున్న తమ గ్యాంగ్ వాళ్లతో అన్నాడు…శ్వేత మనోజ్ లది కూడా ఆ గ్యాంగే…
ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయ్… ఎవరి ప్రిపరేషన్ లో వాళ్లు బిజిబిజీ….. టాపర్ గా రావడం కోసం శ్వేత రాత్రుళ్ళు కూడా బుక్స్ తో మమేకం అయ్యింది. మనోజ్ కూడా శ్వేతకిచ్చిన మాట ప్రకారం,తమ పెళ్ళి కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. మనోజ్ తలపుల నిండా శ్వేతనే…!! ప్రతిఎగ్జామ్ అయ్యాక శ్వేతతో మాట్లాడాలని ట్రై చేసేవాడు మనోజ్. కానీ…వాళ్ళ తమ్ముడే శ్వేతను సెంటర్ దగ్గర దించడం, పిక్ అప్ చేసుకోవడం తో మాట్లాడడానికి వీళు పడేది కాదు. ఎగ్జామ్స్ అయిపోయాయ్. ..రిజల్ట్స్ కూడా వచ్చేశాయ్… 92% అగ్రిగేట్ తో శ్వేత ఆ కాలేజ్ టాపర్. శ్వేత వాళ్ళ గ్రూప్ లో అందరూ మంచి పర్సంటేజ్ లతో పాస్ అయ్యారు, కానీ మనోజ్ మాత్రం రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ .
రింగ్..రింగ్..రింగ్ మంటూ మోగుతుంది మనోజ్ ఫోన్ …అప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న మనోజ్ ఫోన్ ఎత్తి హలో అన్నాడు. హాయ్ మనూ… డొంట్ వర్రీ రా.. సప్లీ రాసి పాసవ్వొచ్చు లే అని ధైర్యం చెప్పింది శ్వేత .. ఏదో బిజినెస్ చేసుకుంటాలే..కానీ మనం మ్యారేజ్ చేసుకుందాం అని మళ్లీ పెళ్లి ప్రపోజల్ తెచ్చాడు మనోజ్… ఓకే రా అది తర్వాత చూద్దాం..మా పెదనాన్న వచ్చారు స్వీట్స్ తీసుకొని నేను మళ్లీ ఫోన్ చేస్తా అంటూ కట్ చేసింది. నాలుగు నెలల తర్వాత మళ్ళీ శ్వేత ఫోన్… హాలో అనగానే… మనూ నేను US వెళుతున్నాను రా… MS చేయడానికి, రేపే ప్రయాణం అని చెప్పింది. గుండెలో పిడుగు పడ్డట్టైంది మనోజ్ కి.. శ్వేత నిజం చెప్పు నేను ఫెయిల్ అయ్యాననే కదా నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావ్.. నువ్వు లేకుంటే నేను బ్రతకలేనే…ILU ILU ILU……………….. ప్లీజ్ వదిలి వెళ్లకు. అరేయ్ మనూ చిల్లపిల్లాడిలా చేయకు..అలా వెళ్లి ఇలా వచ్చేయను MS చేసి… అప్పుడు ఇంట్లో చెప్పి నేనే నిన్ను చేసుకుంటా..అంత వరకు ఓపిక పట్టాలమ్మా ..ఓకే బై అమ్మ పిలుస్తుంది లగేజ్ సర్దుకోడానికి.
Advertisements
Advertisement
అమెరికా………….
తన రూమ్ లో దిగగానే మనోజ్ కు ఫోన్ కలపింది ..శ్వేత ఇక్కడికి వచ్చాక స్వతంత్రం వచ్చింది రా బాబూ…అందుకే ఫోన్ అంటూ మనోజ్ తో ఫస్ట్ టైమ్ ఫోన్లో నాలుగు గంటల వరకు మాట్లాడింది. ఆ ధ్యాసలో డిన్నర్ చేయడంకూడా మర్చిపోయింది. తర్వాత రోజు నుండి MS లో జాయినింగ్.. బిజీబిజీగా అయిపోయింది శ్వేత.! మనూ కాలింగ్ అని తన సెల్ డిస్ ప్లే చూసిన శ్వేత కట్ చేసింది. మళ్లీ కాల్ ,మళ్ళీ కట్..ఇలా నాలుగు సార్లు అయ్యింది. తర్వాత శ్వేతనే ఫోన్ చేసి ..మనూ నువ్వు కాల్ చేయకు నేనే చేస్తా..కట్ చేస్తుంటే అర్ధం చేసుకోవా..? ఎంతపనిలో ఉన్నానో… అంటూ కాస్త సీరియస్ అయ్యింది. ఇక వారానికి ఒక రోజు ఫోన్ చేసుకుందాం అంటూ టైమ్ పెట్టుకున్నారు. అది కాస్తా నెలకు ఒకసారి అయ్యింది, ఆ ఒప్పదం కూడా బ్రేక్ అయ్యి దాదాపు 10 నెలలు కావొస్తుంది శ్వేత నుండి ఫోన్ లేదు.
ఓ రోజు మనోజ్ సెల్ కు ఫోన్ వస్తుంది… శ్వేతనేమోనని ఆశగా తీసాడు..హయ్ రా మనోజ్ …నేనూ వివేక్..బాగున్నావా..? ఏంటి సంగతుల్లాంటి కుశల ప్రశ్నలయ్యాక..మామా నీతో ఓ మాటరా.. అన్నాడు వివేక్. చెప్పురా అన్నాడు మనోజ్… శ్వేతకు నీకు బ్రేక్ అప్ అయ్యిందా… అని అడిగాడు. అలాంటిదేం లేదురా. MS కోసం US వెళ్ళింది రాగానే పెళ్లి చేసుకుంటాం… కాదురా మామా…. తను నిన్ను చేసుకోదు. ఎందకంటున్నావ్ అలా..? నేను ఇక్కడ రోజూ శ్వేతను చూస్తూనే ఉన్నాను… ఆమె ఇక్కడ ఓ హైద్రాబాదీ అబ్బాయితో కలిసి తిరుగుతుంది, మరో విషయం ఏంటో తెలుసా… ఇద్దరూ ఓకే ప్లాట్ లో ఉంటున్నారు. సండే వస్తే సినిమాలు షికార్లతో గడిపేస్తున్నారు. అంటూ ఫోన్ పెట్టేశాడు వివేక్.
Advertisements
ఫోన్ చేసి ఒసేయ్..నాతో మాట్లాడడానికి నీకు టైమ్ ఉండదు, ఎవడితో కులకడానికి , సినిమాలు షికార్లకు మాత్రం మస్త్ టైమ్ ఉంటుందా అని తిడదామనుకుని ఫోన్ తీసాడు..అంతలోనే మనోజ్ కు శ్వేత నుండి కాల్ వచ్చింది. రేయ్ మనూ MS కంప్లీట్, ఇంట్లో చెప్పాను, మన పెళ్ళికి ఓకే అన్నారు… రేపే వచ్చేస్తున్నా అంటూ ఫోన్లోనే పట్టలేని ఆనందంతో ముద్దుల వర్షం కురిపించింది శ్వేత. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు మనోజ్ కి… మళ్ళీ వివేక్ కు ఫోన్ కలిపాడు.. అరేయ్ శ్వేత ఎవరితోనో తిరుగుతుందని అన్నావ్ కదా…అతని ఫోటో పంపురా అన్నాడు. అడిగిన వారంలోపూ శ్వేత, ఆ వ్యక్తి జంటగా కాఫీ తాగుతున్న ఫోటోను వాట్సాప్ లో పంపాడు వివేక్.
రావే రా నీ సంగతి చెబుతా అనుకుని సిగరెట్ల మీద సిగరెట్ల వెలిగించాడు మనోజ్….. రాత్రంతా నిద్రలేదు..ఇంతగా ప్రేమిస్తే తాను ఇలాగా చేసేది. పైగా నన్ను పెళ్ళి చేసుకుంటుందంట పెళ్ళి… అక్కడొకడితో తిరిగి ఇక్కడ నన్ను చేసుకుంటుందా…? అయినా ఈ ఆడవాళ్లనే నమ్మొద్దు ..నమ్మొద్దు…అంటూ అయిపోయిన సిగరెట్ ఫిల్టర్ తో టేబుల్ మీద రాస్తూ ఎప్పుడు పడుకున్నాడో అతడికే తెలియదు.
మార్నింగ్ ట్రింగ్…ట్రింగ్ అంటూ బెల్ మోగుతున్నది ఫోన్ అనుకున్నాడు కానీ అది కాలింగ్ బెల్…. వెళ్ళి తీసాడు. ఎదురుగా శ్వేత హాయ్ మనూ అంటూ గట్టిగా హగ్ చేసుకుంది.ఆ వెచ్చని స్పర్శకు మనోడి నిద్రమత్తంతా వదిలిపోయింది. ఆ కౌగిలింతలోనే తల పైకెత్తి చూశాడు. శ్వేత పక్కనే మరో వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడిని చూడగానే తన కౌగిలిలో ఉన్న శ్వేతను పక్కకు తోసేసి తన వాట్సాప్ లో వివేక్ పంపించిన ఫోటోను చూశాడు. శ్వేత ఇతను అనే లోపు…. మనూ మీట్ మిస్టర్ వంశీ….. మన పెళ్ళికి మా ఫ్యామిలీని ఒప్పించింది ఇతడే…ఇతడు మన పెళ్ళికి పెద్ద మాత్రమే కాదు… నా స్వీట్ అన్నయ్య… US లో నేనున్నది ఇతని దగ్గరే… లవ్లీ అన్నయ్య.. మా పెద్దనాన్న పెద్ద కొడుకు, వెంటనే మనోజ్ ఫోన్ లోని కాంటాక్ట్ లిస్ట్ లో నుండి వివేక్ పేరు డిలేట్ అయ్యింది.