హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యాని కళ్ళ ముందు కనపడుతుంది. నిజాం రాజులు పరిచయం చేసిన వంటల్లో బిర్యానికి వచ్చిన క్రేజ్ మరే వంటకు లేదనే మాట వాస్తవం. కాని హైదరాబాద్ వెళ్తే కచ్చితంగా తినాల్సిన వంటలు కొన్ని ఉన్నాయి. సమయం దొరికితే హైదరాబాద్ లో చక్కర్లు కొడుతుంటే మాత్రం ఇప్పుడు చెప్పే వంటలు తినే వెళ్ళండి… ఆ వంటలు ఏంటీ…? వాటి ప్రత్యేకత ఏంటీ అనేది చూద్దాం.
లాల్ చికెన్ తందూరి విత్ వార్కీ పరాటా: హైదరాబాద్ గురించి బాగా అవగాహన ఉన్న వాళ్లకు, నాన్ వెజ్ ప్రియులకు ఇది కచ్చితంగా సుపరిచితమే. అల్-అక్బర్ ఫాస్ట్ ఫుడ్ కార్నర్లో దొరికే ఈ నాన్ వెజ్ ఐటెం చాలా బాగుంటుంది. రెడ్ కలర్ తందూరీ చికెన్ అలాగే చికెన్ 65 తో వార్కీ పరాఠా టేస్ట్ చేయండి. ఇక హోటల్ అడ్రస్ ఎక్కడంటే… షాప్ నెం. 20, 4-14, షా అలీ బండా రోడ్, మక్కా మసీదు పక్కన, చార్మినార్, ఖిల్వత్. జౌజీ హల్వా: స్వీట్ ఇష్టపడే వాళ్ళు హైదరాబాద్ వస్తే కచ్చితంగా రుచి చూడాల్సిన వంటకం ఇది. నిజాం రాజులు హైదరాబాద్ కు ఇచ్చిన తీపి కానుకగా చెప్తారు ఈ స్వీట్ ను. శతాబ్దం క్రితం 11 ఏళ్ల టర్కిష్ బాలుడు ఈ వంటను హైదరాబాద్ కు పరిచయం చేసాడు. ఇది తయారు చేయాలంటే కనీసం 16 గంటలు పడుతుంది. ఎక్కడ దొరుకుతుందంటే… హమీదీ మిఠాయి షాప్ లో… మొజాం జాహీ మార్కెట్.
ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ కాంబో: హైదరాబాద్ రాగానే చాయ్ రుచి చూస్తారు గాని ఉస్మానియా బిస్కెట్ తో టేస్ట్ చేసి చూడండి ఆ రేంజ్ వేరు. దాదాపు హైదరాబాద్ అంతా దొరుకుతుంది గాని నిమ్రా కేఫ్ మాత్రం దీనికి ఫేమస్. అడ్రస్ క్లియర్ గా చెప్పాలంటే… చార్మినార్ రోడ్, మక్కా మసీదు పక్కన, చార్మినార్, ఘాన్సీ బజార్.బగార్ రైస్: బిర్యాని చేయడానికి బద్దకంగా ఉండే వాళ్లకు ఇది అత్యంత రుచికరమైన వంట. సింపుల్ గా ఏ విధంగా మషాలాలు లేకుండా తయారు చేస్తారు. హైదరాబాద్ నుంచే ఇది అన్ని ప్రాంతాలకు విస్తరించినట్టుగా చరిత్ర చెప్తుంది. చికెన్ లేదా మటన్ ఏదైనా సరే బగార్ రైస్ తో చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళు లేదా ఫంక్షన్ లలో ఎక్కువగా వండుతున్నారు. ఎక్కడ బాగుంటుంది అంటే… బగార్ బౌల్ అనే హోటల్ లో. లక్డికాపూల్ లో ఉంటుంది ఈ హోటల్.
మరాగ్; హైదరాబాద్ లో బిర్యాని తర్వాత అంతగా ఫేమస్ అయిన వంట ఇది. వండడానికి కనీసం 7-8 గంటలు పడుతుంది. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసే ఈ వంటకం చాలా ఫేమస్ అయింది. మటన్ పాయా అని కొన్ని చోట్ల అంటారు. హైదరాబాద్ వెళ్తే కచ్చితంగా రుచి చూడాల్సిందే. అడ్రస్ ఎక్కడంటే హోటల్ షాదాబ్… మదీనా సర్కిల్ లో ఉంటుంది. హైకోర్టు దగ్గర, చార్మినార్, ఘాన్సీ బజార్.రామ్ కీ బండి: హైదరాబాద్ లో టిఫిన్స్ ఎన్ని ఉన్నా సరే ఈ వంట మాత్రం బాగా ఫేమస్. రుచికరమైన దోసెలు, ఇడ్లీలకు ఇది ఫేమస్. దాదాపు మూడు దశాబ్దాల నుంచి హైదరాబాద్ వాసులకు రుచికరమైన టిఫిన్స్ అందిస్తున్న హోటల్ ఇది. అడ్రస్ ఎక్కడంటే సబీర్ బిల్డింగ్, , న్యూ ప్యారడైజ్ లాడ్జ్, కరాచీ బేకరీ పక్కన, బేగంబజార్, అఫ్జల్ గంజ్.
హైదరాబాద్ వెళ్తే మాత్రం ఈ వంటలు అసలు మిస్ కావొద్దు. అలాగే మరిన్ని ఫేమస్ వంటకాలు కూడా ఉన్నాయి. లుఖ్మీ, ఖుబానీ కా మీఠా, పత్తర్ కా ఘోస్ట్, బురానీ రైతా, గోష్ట్ పసిండే వంటి వంటలు కూడా టెస్ట్ చేసి రావాలి.