జాబ్స్ రావడం అనేది ఒక సవాల్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాబ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే సినిమా వెంటనే మారుతుంది. అయితే ఉద్యోగంలో ఇంటర్వ్యూ తర్వాత సాలరీ అడిగే సమయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
Also Read:సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?
సంస్థ స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. అలాగే ఉద్యోగుల సంక్షేమం , మీ నైపుణ్యాలు పెంచుకోవడానికి సహకారం, ఉద్యోగం స్థాయి, వార్షిక జీతం పెరుగుదల లాంటి విషయాలు తెలుసుకుని వాటిని పరిగణలోకి తీసుకుని బేరాలు ఆడటం చాలా మంచిది. మీ నైపుణ్యాలకి మార్కెట్ లో ఉన్న డిమాండ్ అలాగే సప్లై ని అంచనా వేసుకుని బేరం ఆడటం మంచిది. సదరు సంస్థకి అత్యవసరంగా ఖాళిని భర్తీ చేయాల్సి ఉన్నప్పుడు…
మీ నోటీస్ పీరియడ్ చివరిలో ఉన్నప్పుడు… త్వరగా చేరే అవకాశం ఉన్నప్పుడు మీది పై చేయి ఉంటుంది. ఆ విధంగా కాకుండా మాస్ రిక్రూట్ మెంట్, వాకిన్స్ మొదలైన వాటిలో బేరాలు ఆడటానికి అవకాశం ఉండదు. మీలో ఏమైనా ప్రత్యేకత ఉంటే అవకాశం ఉంటుంది. ఆ సంస్థలో పని చేస్తున్న అలాగే చేసిన వారి నుంచి వివరాలు సేకరించి అక్కడ జీతం ఎలా ఉంటుంది, ఏంటీ అనే విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్ళడం ఉత్తమం.