Advertisement
మన తెలుగు సినిమా నటుల నటనా చాతుర్యానికి ఒక్కొక్కరికి వారి పేర్ల ముందు ఒక్కో పేరు, బిరుదు వచ్చి చేరాయి..ఇందులో కొన్ని అభిమానులు వారి వారి నటన మెచ్చి నచ్చి పెట్టుకున్న పేర్లు..మరికొన్ని దర్శకనిర్మాతలు వాళ్లకు ఇచ్చిన క్రెడిట్ల..వెరసి వారి పేర్లకు కొత్తదనాన్ని తీసుకొచ్చిన ఆ బిరుదులు ఏంటో చూద్దామా..
ఎస్వీ రంగారావు – నటసార్వభౌమ
తెలుగు సినిమా చరిత్ర చెప్పుకోవాలంటే ఎస్వీరంగారావు పేరు లేకుండా పూర్తి కాదు.. రంగారావు గారికి ఉన్న బిరుదు నటసార్వభౌమ.
ఎన్టీరామారావు – నటరత్న విశ్వవిఖ్యాత సార్వభౌమ
Advertisements
నందమూరి తారకరామారావు గారి గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే.. తన పేరు ముందున్న బిరుదే చెప్పేస్తుంది తన ఖ్యాతి ఏంటో.. నటరత్న విశ్వ విఖ్యాత సార్వభౌమ..!
అక్కినేని నాగేశ్వర్రావు – నటసామ్రాట్
ప్రేమకథలు, ట్రాజెడి స్టోరిలకు పెట్టింది పేరు ఎఎన్నార్ గారు.. ఈయనకి అభిమానులు ఇచ్చిన బిరుదు నటసామ్రాట్..!
ఘట్టమనేని కృష్ణ –నటశేఖర
కుటుంబ కథలే కాదు, భిన్నమైన కథలు డిఫరెంట్ జానర్ లో సినిమాలు తీయాలంటే ముందుండే వారు కృష్ణ గారు.. నటశేఖర.!
శోభన్ బాబు – నటభూషణ
నటభూషణ్ శోభన్ బాబు…ఆ రోజుల్లో శోభన్ బాబు గారి అంత అందగాడుండేవారు కాదట.. అందగాడిగా వచ్చారు నటించారు..నిష్క్ఱమించారు.
కొంగర జగ్గయ్య – కళా వాచస్పతి
సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి తనదైన గుర్తింపు పొందిన నటుడు కొంగర జగ్గయ్య.. ఈయన బిరుదు కళా వాచస్పతి.
రావు గోపాల రావు – నట విరాట్
విలక్షణ నటుడు రావుగోపాలరావు గారి బిరుదు నటవిరాట్..విలనిజాన్ని పండించడంలోనే కాదు, కామెడితో నవ్వించగలరు.
కైకాల సత్యనారాయణ – నవరస నటన సార్వభౌమ
నవరస నటన సార్వభౌముదు కైకాల సత్యనారాయణ గారు.. విలన్ గా,తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఏ పాత్ర అయినా అవలీలగా పోషించగలరు.
కృష్ణం రాజు – రెబల్ స్టార్
కత్తందుకో జానకి..అని కన్నెర్ర చేస్తే జానకి తోపాటు మనమూ వణికిపోవాల్సిందే.. కృష్ణంరాజు గారి పేరు రెబల్ స్టార్.
రాజేంద్రప్రసాద్ – హస్యకిరీటి
హస్యానికి పెట్టింది పేరు..ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నటుడు రాజేంద్రప్రసాద్.. కామెడి హీరోగా రాజేంద్రప్రసాద్ గారి ప్లేస్ ఇప్పివరకు ఎవరూ చేరుకోలేదు.. అది ఆయనకే సుస్థిరం.. ఆయన బిరుదు హాస్యకిరీటి.
Advertisement
మోహన్ బాబు – నటప్రపూర్ణ
ఎస్వీరంగారావు, ఎన్టీయార్ తర్వాత డైలాగ్ డెలివరీ లో మోహన్ బాబే.. నటప్రపూర్ణ.
చిరంజీవి – మెగాస్టార్
యాక్షన్, డ్రామా,ప్రేమ, రొమాన్స్ మరీ ముఖ్యంగా డ్యాన్స్ ఇలా అన్నింటిని దుమ్ము దులిపేయగల నటుడు చిరంజీవి..చిరంజీవికి ఉన్న పేరు మెగాస్టార్ ..!
నందమూరి బాలకృష్ణ – యువరత్న, నటసింహం
నందమూరి వారసుడిగా అడుగుపెట్టి విభిన్న పాత్రల్లో నటించిన బాలకృష్ణకు అభిమానులు అందించిన బిరుదులు యువరత్న, నటసింహం.
నాగార్జున – యువసామ్రాట్, కింగ్
తండ్రి నటసామ్రాట్ అయితే కొడుకు నాగార్జున యువసామ్రాట్.. కొంతమంది ముద్దుగా మన్మధుడు అనిపిలుచుకుంటారు.
వెంకటేష్ – విక్టరి
వెంకటేష్ పేరు ముందు విక్టరి ఉంటేనే ఆ పేరుకి అందం.
పవన్ కళ్యాణ్ – పవర్ స్టార్
సినిమా హిట్ ,ప్లాప్ తో సంబంధం లేకుండా పవన్ ని ఆరాధిస్తారు అభిమానులు..తనకు పెటటుకున్న పేరు పవర్ స్టార్.
ఎన్టీయార్ – యంగ్ టైగర్
తాత పేరునే కాదు నటనలో కూడా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నటుడు జూ.ఎన్టీయార్.. అభిమానులు యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు.
మహేశ్ బాబు – ప్రిన్స్ , సూపర్ స్టార్
ప్రిన్స్ మహేశ్ బాబు..తొలిసినిమా రాజకుమారుడు పేరునే తన పేరు ముందు సొంతం చేసుకున్నారు..కొందరు సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు.
రాంచరణ్ – మెగా పవర్ స్టార్
తండ్రిలోని మెగా, బాబాయిలో పవర్ ని తీసుకుని మెగా పవర్ స్టార్ అయ్యాడు రాంచరణ్..రంగస్థలం సినిమాతో రాంచరణ్ లోని పూర్తి నటున్ని ప్రేక్షకుల ముందు నిలబెట్టింది.
అల్లు అర్జున్ – స్టైలిష్ స్టార్
స్టైలిష్ స్టార్ ట్యాగ్ లైన్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే నటుడు అల్లు అర్జున్.
నాని – నేచురల్ స్టార్
సహజనటనతో ఆకట్టుకుని చూడగానే పక్కింటి కుర్రాడిలా అనిపించే నటుడు నాని..అందుకే నేచురల్ స్టార్ ట్యాగ్ లైన్ ఇచ్చేసారు.
ప్రభాస్ – యంగ్ రెబల్ స్టార్
పెదనాన్న వారసత్వంతో సినిమాల్లోకి అడుగుపెట్టి ,బాహుబలితో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్.. పెదనాన్న రెబల్ స్టార్, అబ్బాయి యంగ్ రెబల్ స్టార్.
సాయి ధరమ్ తేజ్ – సుప్రీం హీరో
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరో.. మెగాస్టార్ మేనల్లుడు సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్.
శ్రీహరి – రియల్ స్టార్
Advertisements
సినిమాల్లో చిన్న పాత్రలతో మొదలుకొని, మెయిన్ విలన్ గా ఎదిగి..హీరోగా మారి..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిన నటుడు రియల్ స్టార్ శ్రీహరి..