Advertisement
నా ఉద్యోగ నిమిత్తం జైపూర్ కు షిఫ్ట్ అవ్వాల్సి వొచ్చింది. మెయిన్ సిటీ కి దగ్గర్లో ఓ పోష్ ఏరియాలో మంచి ప్లాట్ లో అద్దెకు దిగాను. ఒకరోజు ఉదయం 10 : 30 ప్రాంతంలో మార్కెట్ నుండి కూరగాయలు పండ్లు తీసుకొని ఇంటికి వొస్తున్నాను. అక్కడ ఓ కుర్రాడు ఎవరికోసమో వెయిట్ చేస్తున్నాడు. “మార్కెట్ లో ఎంతో మంది ఎవరెవరి కోసమో వెయిట్ చేస్తుంటారులే ” అనుకుంటూనే ముందుకు కదిలాను . ఆలా కొంచం దూరం నడవగానే …ఆ కుర్రాడు తన బైక్ పై వేగంగా నా వైపుకు దూసుకొచ్చి తాను నములుతున్న గుట్కాను నా మీద ఉంచేసి వెళ్ళాడు.
ఇదిగో ఆ ఫోటో…..
ఒక్కసారిగా షాక్ కు గురయ్యా…మెల్లిగా తేరుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళాను. వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఆ సంఘటన జరిగిన ప్లేస్ కి ఎదురుగా ఓ CCTV ఉంది ..ఆ ఇంటికి వెళ్లి విషయం చెప్పి ..CCTV ఫుటేజ్ కావాలని అడిగా… మొదట ఆ ఇంటి ఓనర్లు బిజీ గా ఉన్నాం అన్నారు ., రెండో రోజు కెమెరాలు పనిచేయట్లేవు అన్నారు .మూడో రోజు కెమెరా వేరే వైపు తిప్పేశారు. దీనర్థం మాకెందుకులే ఈ గొడవలు అని వారి ఉద్దేశం అయ్యుంటుంది. చివరికి మా ఫ్రెండ్ కి చెబితే …ఉంచింది గుట్కానే కదా…”Take It ఈజీ” అనింది.
Advertisement
కానీ ఎందుకో …ఈ విషయం నాకు Take It Easy అనిపించలేదు. ఇలాగే వొదిలేస్తే …’వాడు అడ్వాంటేజ్ తీసుకొని రేపు యాసిడ్ మాత్రం పోయాడని గారెంటీ ఏంటి?’ అని అనిపించింది. ఈ విషయం మా ఇంటి ఓనర్ ఆంటీ తో చెప్పా …తను కంప్లైంట్ ఇద్దాం పదా అంటూ నాతో పాటు వొచ్చింది … నా లాంటి బాధితులు 20 మంది దాకా ఉన్నారు…వాళ్ళు కూడా పోనీలే అనుకున్నారు …కానీ నన్ను చూసి …ఓ బాధితురాలి భర్త ..ఆ పోకిరీకి బుద్ది చెబుదాం పదండి అంటూ మాతో కలిసాడు… మొత్తం దగ్గర్లోని 10 CCTV ఫుటేజ్ లను చూసాం .
Advertisements
వాడు ఉదయం 10 -11 ప్రాంతంలో ఈ పని చేస్తున్నాడు తెలిసింది..దాదాపు 50 మంది పైన ఇలాగే ఉంచేసాడట. బండి మోడల్ …దాని ముందు ఉన్న మూడు నంబర్స్ వరకు కనిపెట్టగలిగాము . అందరం కలిసి కంప్లైంట్ ఇచ్చాము…కేసు దర్యాప్తు లో ఉంది.
ఈ సందర్బంగా మీకు నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే…మనకు తప్పు అనిపించింది గట్టిగా తప్పు అని చెప్పగలగాలి …అంతే కానీ చిన్నది కదా ..చిన్నది కదా… అని లైట్ తీసుకుంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Advertisements