Advertisement
18 నెలలు తల లేకుండా బ్రతికి ఓ కోడి …తన పేరున సరికొత్త రికార్డు ను రాసుకుంది. “Mike The Headless Chicken” పేరిట ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన ఆ కోడి కథేందో..ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాటర్ 1945 ది. అమెరికాలోని లాయ్డ్ ఓస్లెన్ అనే రైతు ఇంటికి అతని అత్తయ్య వచ్చింది. వచ్చిన గెస్ట్ కి మర్యాద చెయ్యాలి కాబట్టి ….నాటు కోడి కూర చేసి పెడదాం అని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా…తన ఇంట్లో ఉన్న కోళ్ల గంపను తీసి ఒకదాన్ని పట్టుకోవాలని చూసాడు.అతన్ని చూసి కోళ్లన్నీ చెల్లాచెదురుగా పరిగెత్తాయి వాటిని పట్టుకోడానికి చాల ప్రయత్నించాడు..కానీ అవేవి ఒస్లెన్ కు దొరకలేదు..దీంతో కోపానికొచ్చిన ఒస్లెన్ కత్తి తీసుకొని కోళ్ళ మీదకు విసిరాడు…అలా విసిరిన కత్తి ఓ కోడి తలకు తగిలింది.దాంతో దాని తల తెగి పడింది. తెగిన మొండెంతోనే ఆ కోడి అక్కడి నుండి పారిపోయింది.!
Advertisement
గంట తర్వాత కూడా అదే కోడి…కొక్కొరొకో అంటూ తెగిన మొండెంతో ఓస్లెన్ కు కనిపించింది! మొదట ఒస్లెన్ షాక్ అయ్యాడు ….తర్వాతర్వాత దాని మీద ప్రేమ పెంచుకొని …ఆ కోడికి మైక్ అని పేరుపెట్టి అల్లారుముద్దుగా చూడడం స్టార్ట్ చేశాడు.మొండెం దగ్గర ఉన్న రంద్రం నుండే దానికి కావాల్సిన నీటిని, దాణాను అందించడం స్టార్ట్ చేశాడు. అలా ఆ కోడి ఒక్కసారిగా అమెరికా అంతటా ఫేమస్ అయిపొయింది ! చివరకు మైక్ మార్చ్ 17, 1947 న…….గొంతులో కణితి కారణంగా తినడానికి కష్టతరమై చనిపోయింది. 18 నెలల పాటు తల లేని కోడిగా జీవించి తనకంటూ ఓ చరిత్రను సృష్టించుకుంది మైక్.
Advertisements