Advertisement
ఓ కుర్రాడు…ఈ రెండు ఫోటోలను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. వాటిని చూసిన వాళ్లు… ఏం పుట్టుక రా నీది… ఆడోళ్ల కాళ్లు ఒత్తుతున్నావ్…మగాడిగా పుట్టావ్… కాస్త కూడా సిగ్గు లేదా? ఈ ఆడంగి పనులు చేయడానికి అంటూ కామెంట్స్ చేశారు.
ఈ కామెంట్స్ కు స్పందించిన అతను దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
- తల్లి కాళ్ల కింద స్వర్గం ఉంటుందంటారు….. మీరు కొటేషన్స్ కే పరిమితం….నేను నా తల్లి కాళ్లు ఒత్తుతూ స్వర్గాన్ని వెతుక్కుంటున్నాను.! జన్మనిచ్చిన తల్లి కాళ్లు ఒత్తడంలో నాకైతే తప్పేమీ కనిపించట్లేదు.
Advertisement
- మరో ఫోటోలో అక్క కాళ్లు ఒత్తుతూ……తల్లి తర్వాత తల్లి నా అక్క…. ఇది కూడా నాకు గర్వకారణమే…. రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకొని పదో, ఇరవైయో ఇచ్చి దులుపుకునే బంధం కాదిది.!
Advertisements
- రేపు నా భార్య కాళ్లు కూడా ఒత్తుతాను … నాకోసం అన్ని వదులుకొని నన్నే సర్వస్వం అనుకొని వచ్చినందుకు…. తన రక్తమాంసాలను ధారబోసి నాకో బిడ్డను ఇచ్చేందుకు సిద్దమైనందుకు….జన్మజన్మల బంధమిది. అయినా ఆడపిల్లలను సుఖాలు తీర్చే బొమ్మలుగా చూస్తున్న మీకు అర్థం కావులేండి ఈ బందాలు. అంటూ చెంప మీద లాగి కొట్టినట్టు రిప్లై ఇచ్చాడు మనోడు.!
Advertisements