Advertisement
తమిళనాడు కు చెందిన 24 సంవత్సరాల సులోచనకు పురిటి నొప్పులు రావడంతో… ఆమె భర్త ఆమెను తమ గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాన్పు కష్టం సిజేరియన్ చేయాలన్నారు డాక్టర్లు…. కాకపోతే రక్తం ఎక్కించాల్సి ఉంటుందనీ, లాక్ డౌన్ వల్ల ఆస్పత్రిలో రక్తం అందుబాటులో లేదనీ, డోనర్ ని తీసుకుని రావాలని గానీ, లేకపోతే, ఊరికి వెళ్ళి నాలుగురోజుల తర్వాత తిరిగి రావల్సిందిగా డాక్టర్లు సూచించారు.
ఆ ఊరిలో తమకు తెలిసిన వారు ఎవ్వరూ లేకపోవడంతో, రక్తం దొరకడం అయ్యేపని కాదని, తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలనీ వారు డిసైడ్ అయ్యారు. అప్పటికే వారిని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసిన అంబులెన్స్ వెళ్ళిపోయింది. ఎలాగోలా సెంటర్ కి వెళ్తే అక్కడ ఏవైనా వెహికల్స్ ఉండొచ్చని, సులోచన, ఆవిడ భర్త, మరో బంధువు… ముగ్గురూ కలిసి మెల్లగా రోడ్డుపై నడుచుకుంటూ బయల్దేరారు.
Advertisement
రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వారిని ఆపి “ఈ సమయంలో ఎక్కడికి వెల్తున్నార”ని అడిగాడు. ‘ఆస్పత్రి నుండీ తమ గ్రామానికి వెల్తున్నామ’ని వారు చెప్పడంతో, వారికి ట్యాక్సీ ని అరేంజ్ చేశాడు. ఇంతలో అణుమానమొచ్చి, “నెలలు నిండినతర్వాత, ఆసుపత్రికి కాకుండా, ఇంటికెందుకెల్తునార”ని అడిగాడు. రక్తం దొరకకపోవడం వల్ల అని తెలియడంతో, కావలసిన బ్లడ్ గ్రూప్ ఏదో కనుక్కుని, వారిని తన డ్యూటీ ఐపోయే టైమ్ 2.PM వరకే అక్కడే వెయిట్ చేయమన్నాడు. ఈ లోపలే ముగ్గురికీ లంచ్ కూడా తెప్పించాడు. డ్యూటీ ఐపోగానే, వారిని నేరుగా హాస్పిటల్ కి తీసుకెళ్ళి, తానే బ్లడ్ డొనేషన్ చేశాడు. రాత్రి పది గంటలకు ఆమెకు పాప పుట్టింది. పాపను చూసి, ఆ తర్వాతే ఇంటికెళ్ళాడు. తెల్లారేకల్లా , ఈ విషయం లోకల్ న్యూస్ లో రావడంతో, డిజీపీ 10,000/- రూపాయలు పారితోషికం ప్రకటించాడు. కానిస్టేబుల్ ఆ పదివేలను బాలింతరాలికి గిఫ్టుగా ఇచ్చేశాడు.
ఆ కానిస్టేబుల్ పేరు అబూతాహిర్.
Advertisements
SOURCE : HANEEF MOHAMMAD.
Advertisements