Advertisement
కూతురు ప్రేమ వ్యవహారం ఆ తల్లిదండ్రులకు తెలుసు…కానీ కులాలు వేరు అనే కారణంతో…ఆ అబ్బాయిని కాదని …వెంటనే ఓ మంచి సంబంధం చూసి ఆ అమ్మాయికి పెళ్లి చేసేశారు.! పెళ్లైన నెలలోపే ఆ నవ వధువు అతడి ప్రియుడితో కలిసి ఉరి వేసుకొని చనిపోయింది.!
తల్లిదండ్రులు : పరువు గురించి ఆలోచించారే తప్ప తన కూతురి జీవితం గురించి ఆలోచించలేదు.! ప్రేమ పేరుతో ఎక్కడ తమ పరువు తీస్తుందోనని హాడావుడిగా 19 ఏళ్లకే పెళ్లి చేసేశారు. నిజంగా పెళ్లి చేయాలనుకుంటే కాసింత టైమ్ ఇవ్వాల్సింది..తన మానసిక స్థితిని అర్థం చేసుకోవాల్సింది..అవసరమైతే కౌన్సిలింగ్స్ ఇప్పించాల్సింది.
అమ్మాయి : ఇంటర్ లోనే ప్రేమ…ఆ వయస్సులో ఉండేది ప్రేమకాదని తెలుసుకోలేక పోయింది! ఆత్మహత్య లాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంది. ప్రియుడుని వదిలి ఉండలేను అనే నిర్ణయమేదో ముందే తీసుకుంటే…రెండు ప్రాణాలు..రెండు కుటుంబాల పరువు నిలబడేది.
Advertisement
అబ్బాయి : 21 సంవత్సరాల అబ్బాయి.. సినిమాల ప్రభావం కారణంగా ఇంకా మెచ్యూరిటీ లెవల్ పెరగలేదు. ఆ అమ్మాయే సర్వస్వం అనే భ్రమలో ఉండిపోయాడు. పెళ్లి తర్వాత కూడా తనపై ఇంకా ఆశలు పెట్టుకున్నాడు. కలిసి బతకలేకపోతే కలిసి చావడం బెటర్ అనే తప్పుడు ఆలోచనను ఆమెలో కలిగేలా చేశాడు… చివరకు ఇలా విగతజీవులుగా మిగిలారు. ప్రేమ గెలిచిందా? ప‌్రాణం పోయిందా?
Advertisements
వరుడు: ఈ టోటల్ ఎపిసోడ్ లో బలి అయ్యింది ఇతను.! జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం ఇలా నెలలోపే ముగుస్తుందని ఊహించి ఉండడు…తన భాగస్వామి ఇలా ఉండాలి అలా ఉండాలని కలలు కని ఉంటాడు..బట్ కలలన్నీ కల్లలుగా మిగిలాయి.! అతడికి ఇంకో భార్య దొరుకుతుంది…కానీ ఈ గాయం మానుతుందా?
ఫైనల్ గా……. ప్రతి దానికి ప్రేమ అని పేరు పెట్టి…నిండు జీవితాలను బలి చేసుకోవొద్దు. టీనేజ్ లో లవ్ అనేది ఓ హై మాత్రమే …ఆ టఫ్ టైమ్ ని కాస్త మన ఆధీనంలో ఉంచుకుంటే మన లైఫ్ ను మంచిగా ప్లాన్ చేసుకోవొచ్చు.! నిజమైన ప్రేమంటే..మనం ప్రేమించిన వాళ్లు సంతోషంగా ఉండడమే.! మన నుండి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే.!
Advertisements